»   » దగ్గుపాటి రాణా తదుపరి చిత్రం 'దుర్గా ఆర్ట్స్' లో..దర్శకుడు ఎవరంటే

దగ్గుపాటి రాణా తదుపరి చిత్రం 'దుర్గా ఆర్ట్స్' లో..దర్శకుడు ఎవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

రీసెంట్ ప్రస్దానం చిత్రంలో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దేవకట్టా త్వరలో రాణా ని డైరక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని కె.ఎల్.నారాయణ తమ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు తాజా సమాచారం. విజయవాడ రౌడీయిజం నేఫద్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంపై స్క్రిప్టు డిస్కషన్స్ ప్రస్తుతం దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో జరుగుతున్నాయి. ఒక్క సారి స్క్రిప్టు ఫైనలైజ్ అయిన తర్వాత అడ్వాన్స్ లు ఇచ్చి మిగతా విభాగాలను ఎంపిక చేసే పని ప్రారంభిద్దామని నిర్మాత చెప్పినట్లు చెప్తున్నారు. ఇక ఇప్పటికే దేవకట్టా చెప్పిన స్టోరీ లైన్ ని రాణా ఓకే చేసారని తెలుస్తోంది. దేవకట్టా రూపొందించిన ప్రస్దానం చూసిన రాణా ధ్రిల్లయి..ఈ చిత్రం అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్దానం చిత్రం మీడియా, మేధావులు అందరూ ఏకబిగిన మెచ్చుకున్నా ప్రేక్షకాదారణ మాత్రం నోచుకోలేదు. అయితే సీరియస్ గా కథనం నడపటం, షాట్ డివిజన్ చూసి రాణా ముచ్చటపడే ఈ అవకాశం ఇచ్చారని చెప్తున్నారు. లీడర్ చిత్రంతో తెరంగ్రేటం చేసిన రాణా ప్రస్తుతం పూరి జగన్ దర్శకత్వంలో నేను..నా రాక్షసి చిత్రం చేస్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu