»   » ‘డిక్టేటర్‌’ బిజినెస్... కోన వెంకట్ భయం ?

‘డిక్టేటర్‌’ బిజినెస్... కోన వెంకట్ భయం ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా పరిశ్రమ రకరకాల సెంటిమెంట్స్, భయాలతో రన్ అవుతూంటుంది. కోట్లతో నడిచే వ్యాపారం కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా పరిస్ధితి తలక్రిందులు అవుతుంది కాబట్టి అలాంటివి తప్పదంటూంటారు. అయితే ఒక్కోసారి కొన్ని చిత్రంగా అనిపిస్తూంటాయి. తాజాగ బాలకృష్ణ చిత్రం డిక్టేటర్ బిజినెస్ పై కోన వెంకట్ ప్రభావం పడిందనే వార్తలు సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ కనిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి కోనవెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించడం ఈ చిత్ర జిజినెస్ విషయంలో మైనస్ గా మారిందని అంటున్నారు. ఈ చిత్రం విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు కోనవెంకట్ భయం పట్టుకుందని, .మొదట్లో ఈ చిత్ర పంపిణీ హక్కులను ఫ్యాన్సీ రేట్లకు ఆఫర్ ఇచ్చిన డిస్థిబ్యూటర్స్ ఇటీవల కోన పనిచేసిన బ్రూస్లీ, అఖిల్, త్రిపుర, శంకరాభరణం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలుగా నిలవడంతో డిక్లేటర్ బిజినెస్ విషయంలో మళ్ళీ బేరాలు మొదలుపెట్టారని చెప్పుకుంటున్నారు.


Kona Venkat Fear to Dictator Business

దానికి తోడు బాలకృష్ణ ముందు చిత్రం 'లయన్ కూడా ఫెయిల్యూర్ కావటంతో డిస్ట్రిబ్యూటర్స్ ముందు ఒప్పందం చేసుకున్న రేట్ల ప్రకారం కూడా తగ్గించమని అడుగుతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే నిర్మాత, దర్శకుడు శ్రీవాస్ మాత్రం ఇందుకు ససేమీరా ఒప్పుకోవడం లేదని వినికిడి. అయితే ఇందులో ఎంత వరకూ నిజముందో తేలాలి. లేక కావాలని పుట్టించిన రూమరా అని అభిమానులు ఆలోచనలో పడుతున్నారు.


సినిమా విషయానికి వస్తే..


దర్శకుడు మాట్లాడుతూ... రక్తం చిందించేవాడు.. సైనికుడు! తన అనుచరుల్లో రక్తం పొంగించేవాడే నాయకుడు. త్యాగానికి, యుద్ధానికి ముందుండేవాడే.. అసలు సిసలైన పోరాట యోధుడు. అలాంటి ధీరోదాత్తుణ్ని మా సినిమాలోనూ చూడొచ్చు అంటున్నారు శ్రీవాస్‌.


Kona Venkat Fear to Dictator Business

తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 20న అమరావతిలో విడుదల చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. వీటికి రవివర్మ నేతృత్వం వహిస్తున్నారు. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

English summary
Kona Venkat associating with Balakrishna's ‘Dictator’ might damage its pre release business value?.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu