For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ సినిమానుంచి ప్రకాశ్ రాజ్‌ని తీసెస్తున్నారా???: ఆ ప్రవర్తన భరించలేకపోతున్నారట

  |

  ప్రకాశ్ రాజ్ నిన్నా మొన్నటి వరకూ తన నటనతో నిర్మాతలని తనచుట్టూ తిప్పుకున్న నటుడు, అటు విలన్ అయినా, ఇటు హీరోకి సపోర్ట్ క్యారెక్టర్ అయినా, తండ్రిపాత్ర అయినా ఏది అయినా ఇచ్చిన పాత్రకి అవసరం ఉన్నదానికంటే ఎక్కువే కంటెంట్ ఇచ్చి ఆ పాత్రని బతికించగల నటుడు. కొన్నాళ్ళ కిందటి వరకూ ప్రకాష్ రాజ్ కాల్షీట్ల కోసం దర్శకులు క్యూ కట్టే పరిస్థితి ఉండేది. అసలు ప్రకాశ్ రాజ్ లేకుండా ఎలా? అన్నట్టున్న పరిస్తితి అసలు ఆయన లేకుంటే ఎమౌతుందీ అసలు అవసరమా అన్నట్టు తయారయ్యింది. లేటెస్ట్ గా భరత్ అను నేను సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ ని తీసెసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.. ఈ సిట్య్వేషన్ ని తనకు తానే చేజేతులా తెచ్చుకున్నాడు ఈ విలక్షణ నటుడు..

  ప్రకాష్ రాజ్ కి డిమాండ్ తగ్గలేదు

  ప్రకాష్ రాజ్ కి డిమాండ్ తగ్గలేదు

  రోజుకి పది లక్షలు చొప్పున రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉండేవారు. షూటింగ్ కి లేట్ గా వచ్చినా షూటింగ్ మధ్యలో చెప్పాపెట్టకుండా మాయం అయిపోతాడనే పేరున్నా ప్రకాష్ రాజ్ కి డిమాండ్ తగ్గలేదు. నిషేధాలు , బాయ్ కాట్ లు గొడవలు..ఇవన్నీ ప్రకాష్ రాజ్ ని ఏమీ చేయలేకపోయాయి.

  Anushka item number in Mahesh's Bharath Ane Nenu After out of Saaho
  ఇష్టపడని తెలుగువాడు ఉండడు

  ఇష్టపడని తెలుగువాడు ఉండడు

  ఏ పాత్రలోనైనా ఇట్టె ఇమిడిపోయి దర్శకుడి ఊహకి తగ్గట్లుగా, ఒక్కొకసారి దర్శకుడి ఆలోచనని వందరెట్లు మెరుగుపరచేలా ప్రకాష్ రాజ్ ప్రదర్శించే నటన అంటే ఇష్టపడని తెలుగువాడు ఉండడు. మంచి తండ్రి, క్రూరమైన విలన్, కన్నింగ్ విలన్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఇలా క్యారెక్టర్ ఏదైనా అది ప్రకాష్ రాజ్ దగ్గరకు వెళ్ళాల్సిందే.

  ప్రకాశ్ రాజ్ లో ఒక దారుణమైన మైనస్ ఉంది

  ప్రకాశ్ రాజ్ లో ఒక దారుణమైన మైనస్ ఉంది

  డేట్స్ కుదరకపోతేనో, రేట్ కుదరకపోతేనో తప్ప వేరే నటుడికి అవకాశమే వచ్చేది కాదు... కానీ ఎంతటి నటుడైనా ప్రకాశ్ రాజ్ లో ఒక దారుణమైన మైనస్ ఉంది చెప్పిన టైం కి షూటింగ్ కి రాడు, చెప్పాపెట్టకుండా సెట్ మీదనుంచి వెళ్ళిపోతాడు లేదంటే అసలు మొత్తం షూటింగే ఎగ్గొట్టేస్తాడు.

  టాలీవుడ్ నిషేధం విధించింది

  టాలీవుడ్ నిషేధం విధించింది

  ప్రకాష్ రాజ్ ఈ తరహాలో ప్రవర్తించడం ఆయనకు కొత్తేమి కాదు. ఇంతకుముందు కూడా అనేక సార్లు షూటింగ్ కి సరిగ్గా హాజరు కాకుండా తెగ ఇబ్బంది పెట్టారని విమర్శలు వెలువడ్డాయి. అంతే కాకుండా ఆ మధ్యలో టాలీవుడ్ ఆయనపై నిషేధం కూడా విధించింది. కానీ ప్రకాష్ రాజ్ ఇప్పుడు అదే తరహాలో వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది.

  పెద్ద తలనొప్పిగా మారాడట

  పెద్ద తలనొప్పిగా మారాడట

  కొరటాల శివ మహేష్ కాంబోలో వస్తున్న "భరత్ అను నేను" సినిమాకి కూడా ప్రకాశ్ రాజ్ పెద్ద తలనొప్పిగా మారాడట. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నాడు. కొరటాల కూడా మొదటి సారి ఈ మహా నటుడిని తన సినిమాలో తీసుకుంటున్నాడు. కానీ ప్రకాష్ రాజ్ తన వ్యవహార శైలితో సినిమా యూనిట్ ని తెగ ఇబ్బంది పెడుతున్నాడట.

  ఒక్క షాట్ కూడా తీయకుండానే ప్యాకప్

  ఒక్క షాట్ కూడా తీయకుండానే ప్యాకప్

  ఆయన వల్ల ఈ సినిమా కొన్ని సార్లు ఒక్క షాట్ కూడా తీయకుండానే ప్యాకప్ చేశారట కొరటాల. అందుకు కారణం ఆయన షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కి రాకపోవడమేనని తెలుస్తోంది. దీంతో చిర్రెత్తిపోయిన కొరటాల ఆ నటుడి స్థానంలో వేరే ఒకరిని తీసుకుంటే బెటర్ అనే ఆలోచనలో పడ్డారట...

  ప్రకాశ్ రాజ్ తప్ప మరో దిక్కులేదు

  ప్రకాశ్ రాజ్ తప్ప మరో దిక్కులేదు

  నిజానికి నిన్నా మొన్నటి వరకూ నటుల కొరత ఉండేది కొన్ని పాత్రలను చేయటానికి ప్రకాశ్ రాజ్ తప్ప మరో దిక్కులేదు అన్నట్టు ఉండేది పరిస్తితి కానీ ఇప్పుడు మరీ అంత అవసరం ఏమీ లేదు. మంచి తండ్రి పాత్ర చేయాలంటే ఒకప్పుడు ప్రకాష్ రాజే దిక్కు.. ఇప్పుడు రాజేంద్రప్రసాద్ రెడీ గా ఉన్నాడు.

  రావు రమేష్ సిద్ధంగా ఉన్నాడు

  రావు రమేష్ సిద్ధంగా ఉన్నాడు

  ఒక విలన్ గా అయినా కథకి బలం చేకూర్చే పాత్ర అయినా పోషించడానికి రావు రమేష్ సిద్ధంగా ఉన్నాడు. ఇక విలన్ గా జగపతిబాబు దుమ్మురేపుతున్నాడు. ఈ ముగ్గురికి ఇప్పుడు సంపత్ తోడయ్యాడు. అటు విలన్ గా, ఇటు పోలీస్ ఆఫీసర్ గా ఒక ఠీవి, దర్పం ఉన్న పాత్రలు చేయడానికి సంపత్ మంచి చాయిస్.

  ప్రకాష్ రాజ్ డిమాండ్ బాగా తగ్గిపోయింది

  ప్రకాష్ రాజ్ డిమాండ్ బాగా తగ్గిపోయింది

  ఇక సత్యరాజ్ కూడా ప్రకాష్ రాజ్ కి మంచి ఆల్టర్నేటివ్. ఇలా ఒక్క ప్రకాష్ రాజ్ కి నలుగురు ప్రత్యామ్నాయంగా తయారవడం తో ప్రకాష్ రాజ్ డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ముందూ వెనుకా చూసుకోకుండా అదే తరహా ప్రవర్తనతో ఉంటే ఇక కెరీర్ కి మంగళం పాడించుకున్నట్టే.

  English summary
  Tollywood Director Koratala Shiva gets Angry with Prakash Raj behavior on "bharat anu nenu" movie sets.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X