»   » మెగా ట్విస్ట్ : ఎన్టీఆర్ ని ప్రక్కన పెట్టి అల్లు అర్జున్ తో ?

మెగా ట్విస్ట్ : ఎన్టీఆర్ ని ప్రక్కన పెట్టి అల్లు అర్జున్ తో ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒక సినిమా హిట్టయ్యిందంటే హీరోలు అందరి దృష్టీ ఆ చిత్రం దర్శకుడు మీదే ఉంటుంది. ఇప్పుడు స్టార్ హీరోలు అందరి దృష్టీ శ్రీమంతుడు చిత్రంతో హిట్ ఇచ్చిన కొరటాల శివ మీదే ఉంది. డీసెంట్ సినిమాగా, చిన్నపాటి మెసేజ్ తో క్లాస్ గా తెరకెక్కించిన శ్రీమంతుడు చిత్రం ఇప్పుడు ఆంధ్రా,తెలంగాణా రాష్ట్రాలనే కాక ఎన్నారైలను సైతం ఊపేస్తోంది. ఈ నేపధ్యంలో మెగా క్యాంప్ దృష్టి కొరటాల శివ పై పడింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కొరటాల శివ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సీన్ లోకి వచ్చాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ కి కథ వినిపించే లోగా అల్లు అర్జున్ పిలిపించి అడ్వాన్స్ ఇచ్చి కథ విని ఓకే చేసి డవలప్ చేయమన్నాడని చెప్తున్నారు.

నిజానికి మహేష్ కన్నా ముందు ఎన్టీఆర్ తో కొరటాల శివ ముందుకు వెళ్తాడనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు లేటవటంతో సీన్ లోకి మహేష్ వచ్చిహిట్ కొట్టారు. ఇప్పుడు కొరటాల మెగా క్యాంప్ లోకి అల్లు అర్జున్ తో వెళ్టానికి రెడీ అయ్యారు. అక్కడ కంటిన్యూగా హీరోలు ఉన్నారు. ఒక హీరో కాకపోతే మరొకరు అన్న పరిస్దితి ఉంది. దాంతో కొరటాల శివ అటు వైపే మొగ్గు చూపాడంటున్నారు. బోయపాటి తో సినిమా చేస్తున్న అల్లు అర్జున్..సైమన్టైనస్ గా ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తాడా లేదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

Koratala Siva next with Allu Arjun?

అల్లు అర్జు్న్,బోయపాటి చిత్రం విశేషాలకు వస్తే....

హైదరాబాద్: అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం మొదలయ్యి రెగ్యులర్ షూటింగ్ జూలై 29 నుంచీ జరుగుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సరైనోడు' అనే టైటిల్ పెట్టే అవకాసం ఉందని సమాచారం. ఈ మేరకు రిజిస్టర్ చేస్తున్నట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్ ఎంపిక పూర్తైందని తెలుస్తోంది. ఆ పాత్రలో కనిపించేది మరెవరో కాదు...గతంలో ఒక విచిత్రం, గుండెల్లో గోదారి చిత్రాల్లో హీరోగా కనిపించిన ఆది పినిశెట్టి అని సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి తెలుగులో బిజీ అవుతానని భావిస్తున్నట్లు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరమ్మాయిలతొ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెచ్చా ని ఈ సినిమాకోసం తీసుకున్నట్టు సమాచారం. కెచ్చా..ధాయిలాండ్ కు చెందిన ఫైట్ మాస్టర్.

అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థలో ఓ సినిమా రూపొందనుంది.థమన్‌.ఎస్‌.ఎస్‌. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., మాటలు: ఎం.రత్నం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శీను.

English summary
Now actually Koratala should direct NTR in his next. However it is coming out that Koratala will be directing Allu Arjun in his next.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu