twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కోసం కొరటాల శివ పొలిటికల్ సబ్జెక్ట్..రచ్చ రేపడం ఖాయమే.. ఆ ప్లాన్ లో భాగమేనా !

    |

    ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ కూడా అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. చరిత్రలో ఎప్పుడూ కలుసుకోని కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలుసుకుంటే ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.

    ఇప్పటికే రామ్ చరణ్ కూడా తాను తర్వాత చేయబోయే సినిమా అనౌన్స్ చేశాడు. ఇదే కోవలో రామ్ చరణ్ కంటే ముందే ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశాడు. అయితే ఏమైందో ఏమో ఆ సినిమా అనూహ్యంగా క్యాన్సిల్ చెయ్యి కొరటాల శివతో సినిమా ప్రారంభం అవుతున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చింది.

     పొలిటికల్ థ్రిల్లర్

    పొలిటికల్ థ్రిల్లర్

    ఈ సినిమా ఈ ఏడాది షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇప్పటి దాకా ఈ సినిమా కథ మీద ఇంకా కొరటాల శివ దృష్టి పెట్టలేదని ప్రచారం జరుగుతూ ఉండగా కొత్తగా మరో ప్రచారం కూడా మొదలైంది. అదేమిటి అంటే ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని అంటున్నారు. కమర్షియల్ సినిమాతో జనాల్లోకి సందేశాలు పంపడంలో దిట్ట అయిన కొరటాల శివ ఈ సినిమా కోసం కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

    ఈ సినిమా మా పొలిటికల్ డ్రామా గా ఉండబోతోందని, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ప్రతిబింబించేలా ఈ సినిమా కథను రాధ సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా కథ చివరి దశలో ఉందని ఒకసారి పూర్తి అయితే దానిని ఎన్టీఆర్ కు వినిపించే అవకాశం ఉందని అంటున్నారు.

    అయినను పోయి రావలె హస్తినకు

    అయినను పోయి రావలె హస్తినకు

    నిజానికి త్రివిక్రమ్ తో కూడా ఎన్టీఆర్ పొలిటికల్ డ్రామా సినిమానే ప్లాన్ చేశారు. అందుకోసం కొన్ని ఆసక్తికర టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉందని గట్టిగా ప్రచారం జరిగింది. తెలుగు వాడు జాతీయ రాజేకీయాల్లో చక్రం తిప్పే లైన్ లో ఆ కధ అప్పట్లో రెడీ చేశాడు.

    అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అనుకోకుండా సినిమా ఆగిపోయింది. ఈ దెబ్బకు కొరటాల శివ లైన్ లోకి వచ్చారు.

    Recommended Video

    Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
    అదే ప్లానా?

    అదే ప్లానా?

    అయితే కావాలనే ఎన్టీఆర్ ఈ పొలిటికల్ థ్రిల్లర్ సిద్దం చేయమని కోరాడని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా తెలుగు దేశానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన ఏకంగా వైసీపీకి సపోర్ట్ అంటూ కొడాలి నాని లాంటి కొందరు నేతలు అప్పుడప్పుడు మాట్లాడుతున్న నేపథ్యంలో తాను టీడీపీకే సపోర్ట్ అని అర్థం వచ్చేలా ఈ సినిమాలో కొన్ని సీన్స్ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎమేరేకు ఉన్నాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

    English summary
    It is known that Jr NTR will be collaborating with Koratala Siva for his immediate next project after RRR. Tentatively titled NTR30, this project is expected to hit the floors later this year. It is said that Koratala Siva has penned a powerful political drama subject for Jr NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X