స్టార్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా.. ఆయన ఎంట్రీతో అంతా సెట్!

అక్కినేని అఖిల్ నాగార్జున సినీ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి పుట్టిన కొన్నాళ్లకే అయిన సిసింద్రీ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొట్టమొదటి సినిమా సిసింద్రీతో సూపర్ హిట్ అందుకున్న అఖిల్ హీరోగా మారాక మాత్రం ఒక్క సినిమాతో కూడా హిట్ కొట్టలేకపోతున్నాడు. తాజాగా ఆయన ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.

మనంతో ఎంట్రీ

మనంతో ఎంట్రీ

సిసింద్రీ తర్వాత అఖిల్ మనం అనే సినిమాలో ఒక చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా కావడంతో పాటు నాగ చైతన్య, నాగార్జున కూడా నటిస్తుండడంతో ఈ సినిమాలో అఖిల్ కూడా క్లైమాక్స్ లో ఒక చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత అఖిల్ అనే సినిమాతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. వి వి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

అఖిల్ ఎఫెక్ట్

అఖిల్ ఎఫెక్ట్

ఆ సినిమా కలిసి రాకపోవడంతో ఆయన ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని మరీ హలో అనే సినిమా చేశారు. అప్పటివరకు మంచి హిట్స్ అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.. అయితే అనూహ్యంగా విక్రమ్ కుమార్ చేసిన ఈ సినిమా కూడా హిట్ దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా తరువాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు.

హలో అంటూ వచ్చి

హలో అంటూ వచ్చి

హలో సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఆయన మళ్లీ మరొక సంవత్సరం గ్యాప్ తీసుకుని యువ దర్శకుడు వెంకీ అట్లూరితో మిస్టర్ మజ్ను అనే సినిమా చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ దెబ్బతో అఖిల్ సినిమాల ఎంపిక మీద ద్రుష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన మంచి కధలను ఎంపిక చేసుకుంటున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అనిపించుకోవాలని

మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అనిపించుకోవాలని


చేసిన మూడు సినిమాలు భారీగా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద ఈ సినిమా నిర్మితం అవుతోంది.

ఏజెంట్ గా మారి

ఏజెంట్ గా మారి

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ కూడా పెట్టినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కరోనా పరిస్థితులు కాస్త కుదుట పడ్డాక ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అఖిల్ తాజాగా దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ మేరకు నాగార్జున కొరటాల శివను సంప్రదించారని, అఖిల్ తో సినిమా చేయడానికి ఆయన సంసిద్దత వ్యక్తం చేశారని అంటున్నారు.

Recommended Video

Harbhajan Singh Says Yes For Ranveer Singh, Geeta Basra Disagrees
ఆ తరువాతే అఖిల్ తో

ఆ తరువాతే అఖిల్ తో

ఇండస్ట్రీలో కొరటాల శివకు అపజయమే లేని దర్శకుడిగా పేరుంది. దాదాపు ఆయన చేస్తున్న అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. అలాంటి ఆయన అఖిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం తాజాగా ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన అఖిల్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X