»   » జూ ఎన్టీఆర్ 'శక్తి' చిత్రంలో ఆ జంట స్పెషల్ ఎట్రాక్షన్

జూ ఎన్టీఆర్ 'శక్తి' చిత్రంలో ఆ జంట స్పెషల్ ఎట్రాక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కంత్రి' వంటి హిట్ ఇచ్చిన మెహర్ రమేష్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న 'శక్తి' చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కీలకమైన పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరికి సంభందించిన షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ఇక చాలా కాలం తర్వాత వెండితెరపై ఈ జంట కనిపించనుండటంతో క్రేజ్ వచ్చే అవకాశం కన్నా పాత్రలకు నిండుతనం వస్తుందని అంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా చేస్తోంది. అలాగే ఈ 'శక్తి' చిత్రాన్ని డిసెంబర్ 24, 2010న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోటప్రసాద్, డి.ఎస్.కన్నన్ రచనా సహకారం, సత్యానంద్ మాటలు, సిరివెన్నెల-రామజోగయ్య శాస్త్రి పాటలు, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్..ఈ చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉందనీ, ఇదొక పవర్ ఫుల్ కథ అనీ అంటున్నారు తన కెరీర్ లోనే ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu