»   » ప్రభాస్‌తో ‘దందా’ చేయబోతున్న కృష్ణం రాజు?

ప్రభాస్‌తో ‘దందా’ చేయబోతున్న కృష్ణం రాజు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన పెదనాన్న కృష్ణం రాజు దర్శకత్వంలో ప్రభాస్ మూవీ చేయబోతున్నాడనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో కృష్ణం రాజు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది? దాని టైటిల్ ఏమిటనే విషయాలు మాత్రం బయటకు రాలేదు.

ప్రభాస్ ‘బాహుబలి' కమిటైన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పక్కన పెట్టేసారు. బాహుబలి విడుదలైన తర్వాత.... ప్రభాస్-కృష్ణం రాజు మూవీ ఉంటుందని భావించినా ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి-2'లో మళ్లీ బిజీ అయ్యారు. దీంతో ఇప్పట్లో వీరిద్దరి మూవీ ఉండదని అంతా ఫిక్సయ్యారు.

ఇలాంటి తరుణంలో కృష్ణం రాజుకు చెందిన సినీ నిర్మాణ సంస్థ ‘గోపీకృష్ణ మూవీ' వారు ‘దందా' అనే టైటిల్ రిజిస్టర్ చేయించడం హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ కోసం చేయబోయే సినిమా కోసమే కృష్ణం రాజు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా అఫీషియల్ సమాచారం రావాల్సి ఉంది.

Krishnam Raju ‘Dhandha’ with Prabhas?

బాహుబలి-2 వివరాల్లోకి వెళితే...
డిసెంబర్ 14న ఫార్మల్ గా పూజా కార్యక్రమాలతో ‘బాహుబలి-2' షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు పండితులు ముహూర్తం ఖరారు చేసారు. సెకండ్ పార్ట్ కోసం దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తారని తెలుస్తోంది. మొత్తం 170 నుండి 190 వర్కింగ్ డేస్ లలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసారు.

యూనిట్ సభ్యులు ప్రతి షెడ్యూల్ కు మధ్య 10 నుండి 20 రోజులు బ్రేక్ తీసుకుంటారని సమాచారం. ప్రభాస్ మొత్తం 10 నెలల పాటు ఈ షూటింగులో గడపనున్నాడు. 2016 సంవత్సరం మొత్తం ‘బాహుబలి-2' షూటింగులో గడిచిపోనున్న నేపథ్యంలో ప్రభాస్ ఇతర సినిమాలేవీ కమిట్ కావడం లేదు.

English summary
Krishnam Raju registered the title ‘Dhandha’ under his banner Gopikrishna Movies. As soon as the news was revealed, fans have been speculating that Krishnam Raju registered such a powerful title only for Prabhas.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu