»   »  మహేష్ ఇవ్వలేని హిట్ మెగా హీరోలిస్తారా?

మహేష్ ఇవ్వలేని హిట్ మెగా హీరోలిస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ తో చేసిన 'వన్' కమర్షియల్ గా హిట్టవకపోవడంతో టాలీవుడ్ లో కృతికి ఒక్క ఆఫర్ కూడా రాలేదు. సినిమా ఫ్లాప్ సంగతి పక్కనపెడితే అందం, నటనతో ఆకట్టుకున్నా ఆమెని పట్టించుకునేవాళ్లే లేరు. దీంతో బాలీవుడ్ కి వెళ్లి పోయి అక్కడ ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న ఈ పొడుగుకాళ్ల సుందరి.....ఇక టాలీవుడ్ లో కనిపించదేమో అనే టాక్ వినిపించింది. కానీ అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ రెండు పెద్ద హీరోల చిత్రాల ఆఫర్స్ దక్కించుకుందని సమాచారం. అవి రెండూ మెగా హీరో చిత్రాలు కావటం విశేషం.

అల్లుఅర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ హీరోయిన్ గా కృతి పేరు పరిశీలిస్తున్నట్టు టాక్. తాజాగా రామ్ చరణ్ సరసన కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్న చెర్రీ.... ఆ తర్వాత శ్రీనువైట్లతో ఓ మూవీకి కమిటయ్యాడు. అందులోనే హీరోయిన్ గా కృతిని పరిశీలిస్తున్నారని వినపడుతోంది.

ఇక ఈ రెండు సినిమాలూ ఓకే అయిపోతే టాలీవుడ్ లో కృతి పేరు మారుమోగిపోవడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినా....ఒక్కసారి మెగా క్యాంప్ లోకి ఎంట్రీ ఇస్తే వరుస ఆఫర్స్ వస్తాయి. అలాంటిది ఒకేసారి ఇద్దరు మెగా హీరోలతో అంటే కృతి సినిమా అంటే లక్కే అంటున్నారు. మరి మహేష్ బాబు అందించలేని విజయం మెగా హీరోలిస్తారా? ఈ ఛాన్స్ తో కృతి పుంజుకుని నిలబడుతుందా? అంటే కాలమే సమాధానం చెప్పాలి.

Kriti Sanon in Ram Charan and AlluArjun Movie

ఇది వరకు మహేష్‌ నటించిన వాణిజ్య ప్రకటనలు చూశా. 'మహేష్‌తో కలసి నటిస్తా' అని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన చాలా కూల్‌. ఎంత సీరియస్‌ సన్నివేశం అయినా సరే, అది చేసొచ్చాక ఎప్పట్లా సరదాగా మాట్లాడేసేవారు'' అంది కృతిసనన్. ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకొన్న ఈ ముంబై భామ.. '1' - నేనొక్కడినేలో మహేష్‌బాబు సరసన నటించింది. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'నా తొలి సినిమా అనుభవాలు మర్చిపోలేను' అని చెబుతోంది కృతి. చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది.

కృతిసనన్‌ మాట్లాడుతూ... 1 సినిమా అందరికీ నచ్చింది. తొలి సినిమాతోనే ఇంత మంచి అవకాశం రావడం నా అదృష్టం. నాకు తెలుగు రాదు. కాకపోతే చిత్రబృందం అందించిన సహకారంతో ధైర్యంగా నటించా. వాళ్లంతా నన్ను ఓ చిన్నపిల్లలా చూసుకొన్నారు. ఈ సినిమాని మా కుటుంబ సభ్యులతో కలసి చూశా. వాళ్లంతా భాష రాకపోయినా అర్థం చేసుకొన్నారు అంది.

' ఓ బాలీవుడ్ సినిమా అడిషన్‌కు వెళ్లిన నన్ను '1' చిత్ర దర్శక నిర్మాతలు చూడటం ఆ సినిమాకు కథానాయికగా ఎంపికచేసుకోవడం జరిగింది. తొలి చిత్రమే మహేష్‌బాబు లాంటి పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడంతో ఈ సినిమాను మరో అలోచన లేకుండా అంగీకరించాను. ఈ చిత్రంలో జర్నలిస్ట్‌గా నా పాత్రను కొత్తగా తీర్చిదిద్దారు దర్శకుడు సుకుమార్. నటిగా మొదటి సినిమాలోనే ఓ ఛాలెంజింగ్ రోల్ కావడంతో పాత్ర సహజసిద్ధంగా రావడం కోసం పాత్రికేయుల హావభావాలు ఎలా వుంటాయో కొంత మంది జర్నలిస్ట్‌ల నుంచి తెలుసుకొని ఈ పాత్రను చేశాను' అని తెలిపింది.

English summary
Nenokkadine fame Krithi Sanon got reputation with a Single movie in Tollywood, tough he movie was failed at Box-office and the actress got a Huge fan base and now, she got an Offer in Allu Arjun - Trivikram Movie as one of the Heroin in Three and also now, she was going to be roped for the Fim of Ram charan - Srinu Vitla Crazy Combination movie and if all goes well , those two movie will start and completed in a same time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu