»   »  నిర్మాత చెత్త బిహేవియర్, '1- నేనొక్క‌డినే' హీరోయిన్ వార్నింగ్ ?

నిర్మాత చెత్త బిహేవియర్, '1- నేనొక్క‌డినే' హీరోయిన్ వార్నింగ్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మ‌హేష్‌బాబు, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన '1- నేనొక్క‌డినే' సినిమాలో హీరోయిన్ గుర్తుందా. ఆమె ఇప్పుడ మరోసారి వార్తల్లో నిలిచింది. మ‌హేష్‌కు జోడీగా న‌టించిన కృతీస‌న‌న్ ఆ తరువాత అక్కినేని నాగ చైతన్యతో 'దోచేయ్' సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఇటు ఆ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడం, అటు ఆమె హైటు కూడా సమస్యగా మారడం వలన ఇక్కడ అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ కు ఆమె ప్రయాణం కట్టింది.

అది ప్రక్కన పెడితే కృతి తాజాగా త‌న చెల్లెలు 'నుపూర్ సనన్' ను కూడా హీరోయిన్ గా పరిచయం చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. అందులో బాగంగా ఓ తెలుగు నిర్మాతను కలిసి, ఆయన తదుపరి చిత్రంకు తన చెల్లిని హీరోయిన్ గా తీసుకునే అవకాసం పరిశీలించమని కోరిందట.

 kriti sanon warning to tollywood producer?

ఆయన కూడా ఓకే అని వెంటనే ఫొటో షూట్ ఎరేంజ్ చేసారట. అయితే ఫొటో షూట్ సమయంలో ఆ నిర్మాత చాలా రూడ్ కామెంట్స్ ..ఆమె చెల్లిపై చేసారట. దాంతో చెల్లి భాధ పడుతూ ఈ విషయం అక్కకి తెలియచేయటం ఆమె తన చెల్లి విషయంలో మరోమాట అంటే కుదరదు అని సీరియస్ గా వార్నింగ్ ఇవ్వటం జరిగిందట.

అయితే ఇదంతా నిజమా లేక ఫిల్మ్ సర్కిల్స్ లో పుట్టిన రూమరా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఇంతకీ ఎవరా ప్రొడ్యూసర్ ...అంత తిట్లు తినేంతలా ఏం రూడ్ గా బిహేవ్ చేసాడు అనేది కూడా తెలియరాలేదు.

English summary
The latest report that hit the media is that kriti sanon warned a Telugu producer for being arrogant with her sister.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu