»   » మహేష్ '1' హీరోయిన్ పెద్ద ఆఫరే పట్టింది

మహేష్ '1' హీరోయిన్ పెద్ద ఆఫరే పట్టింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు '1' చిత్రంలో హీరోయిన్ గా కృతి సనన్ పరిచయ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతిసనన్‌ టీవీ న్యూస్‌ రీడర్‌గా పని చేస్తూ కనిపించి, తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అయితే '1' చిత్రం ఆశించిన మేరకు విజయం సాధించకపోవటంతో ఆమెకు ఊహించని విధంగా ఆపర్స్ రాలేదు. వచ్చిన చిన్న చిన్న ఆఫర్స్ ని ఆమె రిజక్టు చేసింది. అయితే ఆమె అలా రిజక్టు చేయటమే కలిసివచ్చిందంటున్నారు. ఆమె ఇప్పుడు అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఆమెను ఎంపిక చేసారు. ఈ చిత్రంలో ఆమె ఫుల్ బిజీ అవుతానని భావిస్తోంది. ఆ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే సమంతను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

ఈ ముంబై ముద్దుగుమ్మ మొదట ఇంజినీర్‌ కావాలనుకుంది. కాలేజీకెళ్లే టైమ్‌లో నే కొన్ని టీవీ ప్రకటనల్లో కనిపించింది. ఆ తర్వాత మోడలింగ్‌ ని ప్రెఫెషన్ గా తీసుకుంది. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు రావటం మొదలెట్టింది. ఈ లోగా ఆమె ఊహించని విధంగా ఫేమస్‌ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నానీ దృష్టిలో పడింది. ఓ పెద్ద ఫోటోషూట్‌. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. కృతి పేరు ముంబై ఫిలింసర్కిల్స్‌లో మార్మోగిపోయింది. దాంతో వరుసగా బాలీవుడ్‌లో పిలుపులు వచ్చాయి. ఓ సినిమాకి కూడా కమిట్‌ అయ్యింది. అయితే అది అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. దాంతో నిరాసలో ఉంది.


Kriti Sanon will be 1 of the heroines in Bunny-Trivi film

సరిగ్గా అదే సమయంలో మహేష్‌ సినిమా కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని వింది. అంతే వెంటనే హైదరాబాద్‌ వచ్చింది. ఆడిషన్స్‌లో దర్శకనిర్మాతల్ని, హీరోని మెప్పించింది. ఇంకేముంది. '1 నేనొక్కిడినే ' హీరోయిన్ గా ఫిక్సయిపోయింది. తెలుగు పరిశ్రమలోనే మెగాబడ్జెట్‌ సినిమాలో నటించి హాట్‌ టాపిక్‌ అయిపోయింది. అయితే ఆ సినిమా విజయం సాధించకపోవటంతో ఆమె నిరాశపడిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ అల్లు అర్జన్ చిత్రంతో ఫామ్ లోకి వస్తానని భావిస్తోంది.
English summary
Allu Arjun is all set to star under the direction of Trivikram Srinivas. Kriti Sanon may be starring in the film. Kriti made an impressive debut in Tollywood romancing Mahesh Babu in ‘1-Nenokkadine’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu