Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఐదు గంటల్లో రూ.1200 కోట్లు.. RRR విషయంలో అది సాధ్యమయ్యే పనేనా!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ ట్రేడ్‌ను అంచన వేసే కేఆర్కే అనే వెబ్ సైట్ వార్తను ప్రచురించింది. అయితే అది చదవగానే నవ్వు కచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి. అయితే ఆర్ఆర్ఆర్‌పై వచ్చిన ఆ రూమర్ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. అయితే అందులో నిజానిజాలు లేవన్నవి వచ్చిన కామెంట్లను చూస్తేనే అర్థమవుతుంది. ఇంతకీ వారు చెప్పిన విషయం ఏంటో ఓ సారి చూద్దాం.

అత్యంత ప్రతిష్టాత్మకంగా..
ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విజువల్ వండర్‌గా తీర్చి దిద్దేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. సినిమాలోని నటీనటుల నుంచి టెక్నీషియన్స్ దాకా అన్నంటిలోనూ స్టాండర్ట్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తుండగా.. లాక్ డౌన్ అడ్డం వచ్చింది.

చాలా గ్యాప్..
అసలే రాజమౌళి తన సినిమాలను చెక్కుతూనే ఉంటాడన్న పేరుంది. అందులో ఈ కరోనా, లాక్ డౌన్ వచ్చి అంతా తారుమారు చేసింది. మొదటి నుంచి ఆర్ఆర్ఆర్ విషయంలో ఇలాంటివేవో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వచ్చింది. కరోనాతో గత మూడు నెలలుగా షూటింగ్ చేయడం కుదరలేదు. ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

రూమర్స్ వైరల్..
ఇలాంటి సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమాను పర్సనల్ యాప్‌లో రిలీజ్ చేస్తారని, ఆర్జీవీ మాదిరిగా సొంత ఓటీటీ సంస్థను ఏర్పరుచుకుంటారని టాక్ వినిపిస్తోంది. ప్రతీ ఒక్కరికి ఇంత మొత్తం అని ఫిక్స్ చేసి విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి.

ఐదు గంటల్లో రూ.1200 కోట్లు..
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను పర్సనల్ యాప్‌లో విడుదల చేస్తారని, ఒక్కసారి చూడటానికి రూ. 500 గా రేటును ఫిక్స్ చేస్తాడని ఆ రూమర్స్ సారాంశం. 8 భాషల్లో ఇలా రిలీజ్ చేస్తే రాజమౌళి అకౌంట్‌లో ఐదు గంటల్లోనే రూ. 1200 కోట్లు పడతాయని చెప్పుకొచ్చారు.
Recommended Video

నెటిజన్స్ ఫైర్...
అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అలా చేస్తే క్షణాల్లో పైరసీ చేసేస్తారని, అయినా రాజమౌళి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మాత్రమే ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తున్నాడని, ఎవరి ఇంట్లో వారు కూర్చొని చూడటానికి కాదని కామెంట్స్ చేస్తున్నారు.