హైదరాబాద్: మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ‘పిలవని పేరంటం' అనే సినిమా నిన్న ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ ఓరియెంటెడ్ గా నడిచే ఈ హర్రర్ కామెడీలో మంచు లక్ష్మి కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో కమెడియన్ ధనరాజ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
ధన్ రాజ్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా అత్యుత్సాహంతో తను హీరోగా నటిస్తున్న చిత్రం అని చెప్పటంతో మంచు లక్ష్మి సీరియస్ అయ్యిందని ఫిల్మ్ నగర్ టాక్. దానికి తోడు మీడియాలో ఎక్కడ చూసినా మంచు లక్ష్మికి జోడిగా ధన్ రాజు అంటూ వార్తలు వచ్చాయి. ధన్ రాజు తీరు నచ్చని మంచు లక్ష్మి అతన్ని వెంటనే సినిమా నుండి తీసేయించిందని అంటున్నారు.
తనను ఈ చిత్రం నుండి తీసివేయడంతో ధనరాజ్ అవమానంగా ఫీలవుతున్నాడని, సినిమాను ప్రొడక్షన్ డిజైనర్‌గా సెట్స్‌పైకి తెచ్చిన తననే మూవీ నుండి తప్పించడంతో ఈ సినిమాకు పోటీగా " ధనలక్ష్మి తలుపు తడితే " అనే పోటీ సినిమా తీసే ప్రయత్నాల్లో ధనరాజ్ ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో మంచు లక్ష్మీపై సెటైర్లు ఉంటాయని అంటున్నారు. అయితే పరిశ్రమలో బలమైన సినీ ఫ్యామిలీ నుండి వచ్చిన మంచు లక్ష్మితో పెట్టుకోవడం అంటే ధనరాజ్‌కు రిస్కే అని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.
Lakshmi Manchu’s new film Pilavani Perantam was launched recently. The first shot was on Lakshmi Manchu and comedian Dhanraj. “After the launch, Dhanraj had been telling people that he was playing the lead opposite Lakshmi in the film. An offended Lakshmi has now asked the producers to remove or reduce his character to a cameo in the film,” says a source from the unit.
Story first published: Saturday, January 3, 2015, 15:25 [IST]