»   » మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న... ది నేకెడ్ ట్రూత్

మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న... ది నేకెడ్ ట్రూత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న త్వరలో పచ్చి నిజాలను మన ముందుంచబోతోంది. ఆమె ది నేకెడ్ ట్రూత్ పేరుతో ఓ రియాలటీ షోను ప్లాన్ చేస్తోంది. జీ టీవీ వారు ప్రసారం చేసే ఈ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ ను ఆమె పది ప్రశ్నలు అడుగుతుంది. అవి వారి జీవితాలకి సంభందించిన అతి ముఖ్యమైన సంఘటనలు గురించై ఉంటుంది. ఎవరైతే మొహమాట పడకుండా నిజాలు చెప్పుతారో వారు బహుమతిని గెల్చుకుంటారు. ఇది వారు చెప్పేది నిజమా కాదా అన్న దానికి లై డిక్టేటర్ లాంటి పరికరం వాడతారని తెలుస్తోంది. ఇక కొద్ది నెలలు క్రిందట సంచలనం సృష్టించిన ఓ టీవీ రియాలటీ షో ఆధారంగా ఇది తయారైనట్లు చెప్తున్నారు. అలాగే కొంత కాలం క్రిందట ఫాక్స్ టెలివిజన్ ఛానెల్ లో ది మూవ్ మెంట్ ఆఫ్ ట్రూత్ పేరట ఇలాంటి రియాలటీ షోనే టెలీకాస్ట్ అయి పాపులర్ అయింది. ఇక లక్ష్మీ ప్రసన్న ఇప్పటికే జీ ఛానేల్ లో లక్ష్మీ టాక్ షో సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. అలాగే సిద్దార్ద హీరోగా రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాశ్ రూపొందిస్తున్న చిత్రంలో విలన్ గానూ చేస్తూ బిజీగా ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu