కొరటాల శివ, ఎన్టీఆర్ పవర్ఫుల్ టైటిల్.. డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారా..?
జూనియర్ ఎన్టీఆర్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది. ముందు రాజమౌళి RRR వల్ల ఆలస్యం అయితే మరోవైపు కరోనా వైరస్ దెబ్బ కొట్టింది. ఇక కనీసం బుల్లితెరపై అయినా ఒక రియాలిటీ షోతో తొందరగా కనిపిస్తాడని అనుకుంటే ఒక్కసారిగా ఆశల మీద నీళ్లు చల్లినట్లు సెకండ్ వేవ్ వచ్చింది. ఎవరు మీలో కోటీశ్వరుడు ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదని అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
ఇక కొరటల శివతో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ప్రశాంత్ నీల్ తో కూడా భారీ యాక్షన్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కూడా పాన్ ఇండియా కథతో సిద్ధమవుతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. అయితే ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు మొదలవుతాయనేది ఎవరికి తెలియదు.

అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలని ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం జూన్ 15న ఒక స్పెషల్ అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. ఆ రోజు కొరటాల శివ స్వయంగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ పై క్లారిటీ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది. ఒక పవర్ఫుల్ టైటిల్ ను అయితే ఫిక్స్ చేసినట్లు సమాచారం.
అయితే ఇది నమ్మాలి అంటే కొంత కష్టంగానే ఉంది. ఎందుకంటే షూటింగ్ సెట్స్ పైకి వచ్చే వరకు కొరటాల టైటిల్ విషయంలో. పెద్దగా క్లారిటీ ఇవ్వడు. ఆ విధంగా ఆలోచిస్తే అనుమానం అయితే వస్తోంది. ఇక ఈ విషయంలో కన్ఫ్యూజన్ తొలగాలి అంటే జూన్ 15వరకు ఓపిక పట్టాల్సిందే.


Click it and Unblock the Notifications











