twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గెస్ట్ గా చేస్తేనే ఇంత హంగామా...ఇక

    By Srikanya
    |

    హైదరాబాద్ : చేతిలో సినిమాలు లేనప్పుడు చేసింది గెస్ట్ రోల్ అయినా ఐటం సాంగ్ అయినా దాని గురించి ఊదరకొట్టాల్సిందే. ఏదో విధంగా జనాల నోట్లో నానాల్సిందే. లేకపోతే జనం మర్చిపోతారు. ఈ విషయం అందాల రాక్షసి హీరోయిన్ లావణ్య త్రిపాఠి బాగా నమ్మి ఆచరిస్తోంది. ఆమె తాజాగా మనం చిత్రంలో గెస్ట్ గా చేసింది. ఈ విషయం నిర్దారిస్తూ ట్రైలర్ సైతం వదిలారు. అయితే ఇదే విషయాన్ని ఆమె సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా తెలపటమే కాక,తన దగ్గరకు వచ్చిన వాళ్లకి, తెలిసున్న వాళ్లకి అందరికీ ఈ షూటింగ్ గురించి చెప్తోందిట. దూసుకెళ్తా,అందాల రాక్షసి టైమ్ లో కూడా ఇంత హంగామా చెయ్యలేదంటున్నారు.

    ఈ విషయమై లావణ్య ట్వీట్ చేస్తూ.. " అవును, నేను మనంలో గెస్ట్ గా చేసాను. విక్రమ్ సార్ నన్ను పిలిచి చేయమని అడిగారు, వెంటనే నేను చేస్తానని చెప్పాను, ఆ యూనిట్ తో అద్బుతమైన ఎక్సపీరియన్స్ ," అంటూ చెప్పుకొచ్చింది. గెస్ట్ గా చేస్తేనే ఇంత హంగామా చేస్తోంది...అదే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తే ఇంకేమన్నా ఉందా అంటున్నారు ఆమె తోటి హీరోయిన్స్.

    అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబం నిర్మించింది. ఈ చిత్రం సెన్సార్ రీసెంట్ గా జరిగింది. ఈ చిత్రం దర్శకుడు విక్రమ్ కుమార్ మంచి టాలెంట్ ఉన్నవాడిని ఇప్పటికే ఇష్క్, 13బి వంటి చిత్రాలతో ప్రూవ్ అయ్యింది. కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రొడక్టే ఇచ్చి ఉండే అవకాసం ఉంది. అలాగే నాగార్జున సైతం ఎక్కడా ఖర్చుకు వెనతీయకుండా పెట్టి నిర్మించటం కూడా ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడటానికి కారణమవుతోంది. ఈ చిత్రంలో అమితాబ్ గెస్ట్ గా కనిపించనున్నారు.

     Lavanya Tripathi shares her 'Manam' experience

    నాగార్జున మాట్లాడుతూ "నాన్నగారు నటించిన చివరి చిత్రం కాబట్టిసినిమా మీద అంచనాలు మెండుగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఇది మంచి సినిమాఅవుతుంది అనిపిస్తోంది.ఇది పూర్తి కుటుంబ సభ్యులతో చూడతగ్గ చిత్రం లా ఉంటుందని చాలా మందిఫోన్లు చేసి వాకబు చేస్తున్నారు. నాన్న,నేను, చైతన్య కలిసి నటించిన ఈ సినిమానుఅన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ లో ఓ ప్రెస్టీజియస్ సినిమా గా దర్శకులు విక్రమ్ కుమార్ రూపొందించారుసినిమా ఆడియోను ఈ నెలలో నే విడుదల చేసి సినిమానుమే నెల 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము'' అన్నారు

    అలాగే ...కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం అంటున్నారు నాగార్జున. '' 'ఇంటిల్లిపాది చూడాల్సిన సినిమాలా ఉంది' అంటున్నారంతా. నిజంగానే ఇది అలాంటి సినిమానే. మనందరి ప్రేమకథని 'మనం'లో చూడొచ్చు. మా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రమిది. త్వరలో పాటల్ని వినిపిస్తాము''అన్నారు.

    అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

    English summary
    Lavanya Tripathi tweeted “Yes i have done a cameo in “Manam” Vikram sir asked me to do it, so of course i said yes:) had a wonderful experience wid d team,” .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X