»   » డైరక్టర్ కృష్ణ వంశీకి ట్విస్ట్ ఇచ్చిన 'లీడర్' భామ

డైరక్టర్ కృష్ణ వంశీకి ట్విస్ట్ ఇచ్చిన 'లీడర్' భామ

Posted By:
Subscribe to Filmibeat Telugu

'లీడర్" సినిమాతో పరిచయమై 'నాగవల్లి" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న రిచా ఉపాధ్యాయ రీసెంట్ గా కృష్ణ వంశీకి ట్విస్ట్ ఇచ్చి ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా హీరోయిన్స్ చాలా మంది కృష్ణవంశీ, రాఘవేంద్రరావు వంటి కొందరి దర్శకత్వంలో నటించటానికి ఆసక్తి చూపుతారు. అయితే 'మిరపకాయ్" హిట్‌తో తన రేటును హాట్‌హాట్‌గా పెంచేసిన ఈ అమ్మడుని కృష్ణవంశీ తన తాజా చిత్రం మొగుడు కోసం అడిగారు. గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ చిత్రం కోసం అడిగితే డేట్స్ మాట తర్వాత ముందు కథ చెప్పండి అంది. ఖంగుతిన్న నిర్మాత వెంటనే ఈ విషయాన్ని దర్శకుడుకి చెపితే ఆయన ఆఫీసుకు వస్తే చెప్పటానికి రెడీ అన్నారు. అయితే ఆయన్ని కలిసి కథ వినటానికి ఆమెకు నెల రోజులు టైం పట్టింది. పోనీ నెల రోజుల తర్వాత అయినా ఫైనలైజ్ చేసిందా అంటే..కొంత టైం అడిగి, తన క్యారెక్టర్ కొత్త డౌట్స్ చెప్పింది. దాంతో ఇంతకాలం వెయిట్ చేసేందుకు నీకంత సీన్ లేదని చెప్పి ఆమెకు బదులుగా అడగ్గానే ఎగరి గంతేసి డేట్సే ఇచ్చేసే తాప్సీని తీసుకున్నారు. ఇలా ఆమె మరో రెండు చిత్రాలు రీసెంట్ గా పోగొట్టుకుంది. దాంతో ఆమె పేరు చెపితే దర్శక, నిర్మాతలు భయపడుతున్నారు. కేవలం రానా రికమండేషన్ తో ఎన్ని సినిమాలు చేయవచ్చేది ఆమె ఆలోచించుకోవాల్సిన విషయం అంటున్నారు.

English summary
Krishna Vamsi and Bujji contacted Richa Gangopadhyaya to cast her in this film. But the lady has reportedly said no to it citing date problems. Richa Gangopadhyaya who made her debut with Leader last year has already starred in films like Nagavalli and Mirapakaya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu