For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa The Rule: పుష్ప 2లో హాలీవుడ్ రేంజ్ సీక్వెన్స్.. RRRను మించేలా.. బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్థాయి అంచలంచెలుగా పెరుగుతూనే ఉంది. దీనికి కారణం మన చిత్రాలకు దేశ వ్యాప్తంగా విశేషమైన ఆదరణ లభిస్తుండడమే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు నేషనల్ రేంజ్‌లో సత్తా చాటాయి. అలా గత ఏడాది వచ్చి పాన్ ఇండియా సక్సెస్‌ను సొంతం చేసుకున్న చిత్రమే 'పుష్ప ద రైజ్'. పేరుకు తెలుగు సినిమానే అయినా దేశ వ్యాప్తంగా హవాను చూపించింది. అందుకే ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 2' నుంచి ఓ అదిరిపోయే న్యూస్ లీకైంది. వివరాల్లోకి వెళ్తే..

   అక్కడా ప్రభావం చూపిన పుష్ప

  అక్కడా ప్రభావం చూపిన పుష్ప

  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే 'పుష్ప' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది. అలాగే, మిగిలిన చోట్లా ప్రభావాన్ని చూపించి రచ్చ రచ్చ లేపేసింది.

  జాన్వీ కపూర్ ఎద అందాల అరాచకం: టైట్ టాప్‌లో యమా హాట్ ట్రీట్

  అన్ని కోట్ల లాభాలతో రికార్డులు

  అన్ని కోట్ల లాభాలతో రికార్డులు

  గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 కోట్లకు పైగా లాభాలు కూడా దక్కాయి.

  రూల్ చేయడానికి వస్తున్నారు

  రూల్ చేయడానికి వస్తున్నారు

  మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పుష్ప' మూవీ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే, ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ చేయనున్నారు. దీనికి 'పుష్ప.. ద రూల్' అనే టైటిల్ పెట్టారు. ఇందులో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేయబోతున్నారు.

  బ్రా తీసేసి అషు రెడ్డి అందాల ఆరబోత: పవన్ కోసం మరోసారి దారుణంగా!

  షూట్ అవకున్నా బిగ్ ఆఫర్స్

  షూట్ అవకున్నా బిగ్ ఆఫర్స్

  'పుష్ప' మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. అలాగే, ఇందులో చాలా మంది స్టార్లను యాడ్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాకు షూట్ మొదలు కాకుండానే భారీ ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది.

  పుష్ప 2లో హాలీవుడ్ యాక్షన్

  పుష్ప 2లో హాలీవుడ్ యాక్షన్

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప ద రూల్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇందులో యాక్షన్ రేంజ్‌ను మరింతగా పెంచాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను పెట్టబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిల్మ్ నగర్‌లో వైరల్ అవుతోంది.

  మసాజ్ పిక్‌తో షాకిచ్చిన తెలుగు హీరోయిన్: ఏమీ లేకుండానే కనిపించడంతో!

  RRRను మించేలా లయన్‌తో

  RRRను మించేలా లయన్‌తో

  'పుష్ప ద రూల్' మూవీలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్‌ సీన్‌ ఓ రేంజ్‌లో ఉండబోతుందట. ఇది ఓ సింహంతో జరిగే పోరాటంతో డిజైన్ చేసినట్లు తెలిసింది. ఒక రకంగా చెప్పాలంటే RRR మూవీలో ఎన్టీఆర్ 'పులి' సీన్ ఎంత హైలైట్ అయిందో.. దానికి మించేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే బన్నీ అభిమానులు పూనకాలు గ్యారెంటీ అని చెప్పొచ్చు.

  English summary
  Icon Star Allu Arjun will do Pushpa 2 Under Creative Director Sukumar Direction. Lion Fight Sequence will be Highlight in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X