»   » సుకుమార్ దారిలోనే నిర్మాతగా మారిన త్రివిక్రమ్, ప్రొడ్యూస్ చేయబోయే సినిమాల లిస్ట్

సుకుమార్ దారిలోనే నిర్మాతగా మారిన త్రివిక్రమ్, ప్రొడ్యూస్ చేయబోయే సినిమాల లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆ మధ్యన సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై 21 ఎఫ్ అనే చిత్రం నిర్మించి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారులో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతగా మారబోతున్నట్లు సమాచారం. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత‌గా.. ద‌ర్శ‌కుడిగా మంచి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయ‌న నిర్మాత‌గా కూడా మారుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అది కూడా వేరే వాళ్లు తీసే సినిమాకు నిర్మాత‌గా మారుతున్నాడ‌ట‌. ఆయన నిర్మించబోయే చిత్రాల హీరోలు, దర్శకులను ఎవరో చూద్దాం.

నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం. లిరిక్ రైటర్ నుంచి దర్సకుడుగా మారిన కృష్ణ చైతన్య గతంలో నారా రోహిత్ తో రౌడీ ఫెలో అనే చిత్రం డైరక్ట్ చేసారు. ఆ చిత్రం జస్ట్ యావరేజ్ సినిమా అనిపించుకుంది. ఆయన కొంతకాల క్రితం నితిన్ కు కథ చెప్పి ఒప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదే చిత్రాన్ని త్రివిక్రమ్ నిర్మించనున్నారు.

List of Movies being produced by Trivikram revealed

రీసెంట్ గా కళ్యాణ వైభోగమే చిత్రంతో పలకరించిన నందిని రెడ్డి దర్శకత్వంలో ఆయన ఓ చిన్న సినిమాను నిర్మించనున్నట్లు తెలిసింది. పెళ్లిచూపులు చిత్రంతో కమర్షియల్ సక్సెస్‌ను దక్కించుకున్న విజయ్‌దేవరకొండ ఇందులో హీరోగా నటించనున్నట్లు సమాచారం. నవ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది.

మరో ప్రాజెక్టు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండనుంది. అవసరాల శ్రీనివాస్ డైరక్ట్ చేసే చిత్రానికి హీరో ఎవరనేది మాత్రం ఖరారు కాలేదు. ప్రస్తుతం అవసరాల స్క్రిప్టు వర్క్ లో బిజీగా ఉన్నారట.

ఇక త్రివిక్రమ్ డైరక్ట్ చేయబోయే చిత్రం విషయానికి వస్తే... పవన్ కల్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోండగా, పవన్ చేయబోవు తర్వాతి చిత్రంపై అనేక వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం కొరటాల ఓ పొలిటికల్ స్క్రిప్ట్ చేసాడని ప్రచారం జరుగుతోండగా, మరో వైపు ఎ.ఎం.రత్నం తో కూడా సినిమా చేసేందుకు పవన్ కొబ్బరికాయ కొట్టేసారు.

ఇక ఇదిలా ఉంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ కథను సిద్ధం చేసినట్టు వార్తలు షికారు చేశాయి. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేరోజు ఎంతో దూరంలో లేదనేది తాజా సమాచారం. అయితే ఈ సినిమాకు నాగార్జున నటించిన సంతోషం చిత్రంలోని 'దేవుడే దిగి వచ్చినా' .. పాటలోని మొదటి పదాలను టైటిల్ గా ఫిక్స్ చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. పవన్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉండగా రాథా కృష్ణ ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు సమాచారం.

English summary
Trivikram Srinivas was debuting into production soon. His upcoming films as a producer were revealed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu