»   » డైరక్షన్ కూడా మారుతి నే చేసాడని టాక్

డైరక్షన్ కూడా మారుతి నే చేసాడని టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సుమంత్‌ అశ్విన్‌, నందిత జంటగా నటించిన చిత్రం 'లవర్స్‌'. హరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు నిర్మాతలు. మారుతి కథనం, మాటలు అందించారు. వచ్చే నెల 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ నేఫధ్యంలో సినీ పరిశ్రమలో ఓ టాక్ మొదలైంది. దర్శకుడు చేసిన సినిమాని చూసిన హీరో తండ్రి ఎమ్.ఎస్ రాజు అంసంతృప్తి చెందడంతో, మారుతినే ఈ ప్రాజెక్టు రీషూట్ లు చేసి ఫినిష్ చేసాడని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది ఆ దగ్గర వాళ్లకు మాత్రమే తెలిసే నిజం.

దర్శకుడు మాట్లాడుతూ ''యువత మనస్తత్వాన్ని ప్రతిబింబించే కథ ఇది. వినోదభరితంగా ఉంటుంది. మారుతి, నిర్మాతలు చాలా సహకరించారు. జె.బి. సంగీతం బావుంది. సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు ''అన్నారు. ''పాటలకు మంచి స్పందన వస్తోంది. మారుతి అందించిన కథనం, మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు నిర్మాతలు.

మారుతి మాట్లాడుతూ- ''కొత్త లవ్‌స్టోరీ ఇది. స్ర్కీన్‌ప్లే, మాటలు అందించాను. సాయి, సప్తగిరి మంచి పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. హరి చక్కగా డైరెక్ట్‌ చేశాడు. జెబి సంగీతం, జోషి కెమెరా సినిమాకు హైలైట్స్‌. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కించారు. నా గత సినిమాల్లాగా ఈ సినిమా కూడా సక్సెస్‌ కావాలి'' అని అన్నారు.

'Lovers' to be released on August 8th

సినిమా బాగా రావాలని నిర్మాతలు కష్టపడ్డారని, తన పాత్ర జనాలకు నచ్చుతుందని సుమంత్‌ అశ్విన్‌ తెలిపారు. సినిమా బాగా వచ్చిందని నందిత, జె.బి అన్నారు.
మారుతి సమర్పణలో రూపొందిన 'లవర్స్‌'లో సుమంత్‌ అశ్విన్‌, నందిత జంటగా నటించారు. మాయాబజార్‌ మూవీస్‌ నిర్మిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు నిర్మాతలు. హరినాథ్‌ దర్శకుడు. జె.బి.సంగీతాన్ని సమకూర్చారు.

షామిలి, తేజస్విని, ఎం.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్, సాయి, నవీన్, చిట్టి, సన, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:మల్హర్ భట్ జోషి, సంగీతం:జె.బి., ఎడిటింగ్: ఉద్ధవ్.ఎస్.బి., మాటలు:చింతపల్లి రమణ, నిర్మాతలు:సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు.బి., సమర్పణ:మారుతి, రచన, దర్శకత్వం:హరి.

English summary
Sumanth Ashwin has paired up with 'Premakatha Chitram' fame Nanditha for the movie, 'Lovers'. Maruthi has provided the screenplay and dialogues for this movie and Hari is the director. The film is getting ready for a release on August 8th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu