»   » మహేష్ తో ఛాన్స్ కొట్టేసిన లక్కీ సమంత?

మహేష్ తో ఛాన్స్ కొట్టేసిన లక్కీ సమంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలోని అందరినీ ఆకట్టుకుంటున్న అందం సమంత. నాగచైతన్య హీరోగా చేసిన 'ఏ మాయ చేసావె' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆమెకు తాజాగా మహేష్ సరసన ఆఫర్ వచ్చింది. ఈ మేరకు మహేష్ సోదరి మంజుల ఓ ప్రకటన చేసింది. సమంత అందచందాలు, నటన 'ఏ మాయ చేసావె' చిత్రానికి ప్రధాన ఎస్సెట్ అనీ, మహేష్ బాబుతో తాము నిర్మించబోయే తదుపరి చిత్రంలో కూడా సమంతను అనుకుంటున్నామని ఆ చిత్ర నిర్మాత మంజుల ప్రకటించారు. మహేష్ తో చేయాలని హీరోయిన్స్ అంతా ఎదురుచూస్తూంటారు. ఆఫర్ వస్తే లక్కీ ఛాన్స్ గా భావిస్తూంటారు. అలాంటిది మొదటి సినిమాకే ఆ ఆఫర్ రావటం సమంతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇక 'ఏ మాయ చేసావె' చిత్రం చూసిన వారు ఆమెను జెస్సీగా పిలుస్తారుట. అంతలా ఆ పాత్రకు కనెక్ట్ అయిపోయారని సమంత మురుస్తోంది. అలాగే ఎన్టీఆర్ 'బృందావనం' చిత్రంలోనూ ఆమె సెకెండ్ హీరోయిన్ గా చేస్తంది. మరోప్రక్క పెద్ద హీరోల నిర్మాతలు సైతం ఆమె డేట్స్ కోసం సంప్రదిస్తున్నారు. 'ఏ మాయ చేసావె' చిత్రంతో నాగచైతన్యకు రాని క్రేజ్ ఆమె సంపాదించుకోగల్గింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu