»   » ఎమ్.ఎస్ రాజు మళ్లీ మొదలెట్టారు

ఎమ్.ఎస్ రాజు మళ్లీ మొదలెట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
M.S Raju again with his son
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు ..నిర్మాత నుంచి దర్శకుడుగా షిఫ్ట్ అయిన వద్ద నుంచి ఆయనకు సక్సెస్ లు కరువయ్యాయి. వాన చిత్రం డిజాస్టర్ ఫలితం ఇచ్చినా తర్వాత తూనీగ తూనీగ అంటూ ఆయన కుమారుడుని లాంచ్ చేసారు. ఆ చిత్రం టీవీ సీరియల్ తరహాలో ఉందంటూ విమర్శలు వచ్చి ఫ్లాప్ అయ్యింది. తర్వాత ముగ్గురు హీరోయిన్స్ తో రమ్ అనే చిత్రం మొదలెట్టారు. ఆ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కే ఆర్ధిక ఇబ్బందులలో ప్యాకప్ అంది.

ఈ నేపధ్యంలో ఆయన ఇప్పుడు మరో చిత్రం చేయటానికి సిద్దమవుతున్నారు. ఈ సారి ఆయన దర్శకత్వం వహించబోయే చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈ చిత్రానికి ఆయన రెండు టైటిల్స్ ని పరిశీలుస్తున్నారు. అవి...

1) హార్ట్ ఫర్ సేల్ (ఉపశీర్షిక : స్లైట్లీ డామేజ్డ్)

2) ప్రేమకథ లేనిదెవరికి?

ఈ రెండు టైటిల్స్ లో ఒకటి పెట్టనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో ఆయన కుమారుడు హీరోగా నటిస్తారని చెప్తున్నారు. ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ..ఈ మధ్యనే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో హిట్ కొట్టాడు. అదే ఉత్సాహంతో మారుతి చిత్రం లోనూ చేస్తున్నాడు. ఇప్పుడు తన తండ్రితో చేయనున్నాడని సమాచారం.

English summary
'Sankranthi Raju' MS Raju wants to direct his son Sumantha Aswain again. The film title would be...Heart for Sale.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu