Don't Miss!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
MAA Elections: పోటీలో ఐదుగురు ప్రముఖులు.. స్టార్ల మద్దతు మాత్రం ఒక్కరికే.. తెర వెనుక జరిగిందిదే
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల బాగోగులు చూసేందుకు ఓ సంఘం ఉండాలన్న లక్ష్యంతో చాలా కాలం క్రితం 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్'ను ఏర్పాటు చేశారు. ఆరంభంలో దీనికి సీనియర్లను అధ్యక్షులుగా ఎన్నుకునేవారు. అయితే, రానురానూ పరిస్థితుల మారడంతో ఈ పదవికి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీంతో ఇద్దరు ముగ్గురు ఈ పోటీలో నిలుస్తున్నాయి. అయితే, ఈ సారి మాత్రం ఏకంగా ఐదుగురు ప్రముఖులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, ఇందులో మాత్రం ఒక్కరికే టాలీవుడ్‌లోని మెజారిటీ సభ్యుల సపోర్టు ఉందని తాజాగా తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

ఎన్నికలు ఎప్పుడో.. హడావిడి ఇప్పుడే
నిర్ణీత కాల పరిమితికి 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్'కు ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇవి జరగనున్నాయి. అయితే, దానికి మూడు నెలల ముందే అంటే ఇప్పటి నుంచే ఆ హడావిడి కనిపిస్తోంది. ప్రస్తుతం పాలక వర్గం విధులు నిర్వహిస్తుండగానే సినీ పరిశ్రమలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. దీంతో టాలీవుడ్‌లో య'మా' సందడి వాతావరణం కనిపిస్తోంది.

అధ్యక్ష పదవికి ఐదుగురు ప్రముఖులు
చాలా కాలంగా 'మా' ఎన్నికలు అంటే ఇద్దరు ముగ్గురు ప్రముఖులు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అయితే, ఈ సారి మాత్రం ఏకంగా ఐదుగురు నటీనటులు ఎన్నికల బరిలో నిలిచారు. వారెవరో కాదు చాలా కాలంగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తోన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావులు పోటీ పడబోతున్నారు.

ఎవరి లెక్కల్లో వాళ్లు.. ఆశలు, హామీలు
ప్రస్తుతం పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఐదుగురు ప్రముఖులు ఎవరి లెక్కల్లో వాళ్లు ఉన్నారు. ప్రకాశ్ రాజ్ 'మా' భవనం నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్నారు. అలాగే, మంచు విష్ణు ఇండస్ట్రీ బిడ్డను అంటూ భావోద్వేగంతో కొడుతున్నాడు. వీళ్లతో పాటు జీవితా రాజశేఖర్, హేమ లేడీ సెంటిమెంట్‌తో బరిలోకి దిగగా.. సీవీఎల్ మాత్రం తెలంగాణ వాదంతో పోటీ చేయడానికి రెడీ అయ్యారు.

ఏ అభ్యర్థికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు?
'మా' అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న ఐదుగురు అభ్యర్థుల్లో... ప్రకాశ్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ, కొందరు స్టార్ హీరోలు.. మంచు విష్ణుకు సీనియర్ నటుల మద్దతు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, జీవితా రాజశేఖర్‌కు లేడీ ఆర్టిస్టులతో పాటు నందమూరి కుటుంబం, 'మా' అధ్యక్షుడు నరేష్ సపోర్టు.. హేమ, సీవీఎల్‌కు చిన్న ఆర్టిస్టుల మద్దతు ఉందనే టాక్ బాగా వినిపిస్తోంది.

హైలైట్‌గా ప్రకాశ్ రాజ్... ఆ టాక్ ఉన్నా
'మూవీ
ఆర్టిస్టు
అసోషియేషన్'
ఎన్నికల్లో
ప్రకాశ్
రాజ్
హైలైట్
అవుతున్నారు.
దీనికి
కారణం
ఆయన
అందరి
కంటే
ముందు
నుంచే
ఈ
పనుల్లో
బిజీ
అవడమే.
ఇప్పటికే
తాను
పోటీ
చేస్తున్నట్లు
ప్రకటించారు.
అలాగే,
ఇప్పటికే
27
మంది
సభ్యులతో
కూడిన
ప్యానెల్‌ను
కూడా
ప్రకటించారు.
ఈ
క్రమంలోనే
ఆయన
నాన్
లోకల్
అని
వాదన
నడుస్తున్నా..
మరింత
దూసుకుపోతున్నారు.

స్టార్ల మద్దతు మాత్రం ఒక్కరికే ఉందంటూ
ఈ సారి జరగబోతున్న 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల్లో ఐదుగురు ప్రముఖులు పోటీలో ఉన్నప్పటికీ.. తెలుగు సినీ ఇండస్ట్రీలోని మెజారిటీ సభ్యుల సపోర్టు ఒక్కరికే ఉందట. అది ఎవరికో కాదు.. ప్రకాశ్ రాజ్. అవును.. ఆయనకే చాలా మంది స్టార్లు సపోర్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీలో తెర వెనుక జరిగినది ఏమిటంటే?
ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్రభావం ఎక్కువగా కనిపించడానికి ఆయన తెర వెనుక చేస్తున్న పనులే కారణం అని ఓ టాక్ వినిపిస్తోంది. చాలా రోజుల క్రితమే ఈయన సినీ పెద్దలతో తన పోటీ గురించి మాట్లాడడం.. వాళ్ల నుంచి మద్దతు కోరడం వంటివి చేశారు. అదే సమయంలో చాలా మంది పెద్దల నుంచి హామీ కూడా తీసుకున్నారు. ఇప్పటికీ పలువురితో ఆయన చర్చలు జరుపుతున్నారట.