MAA Election: కోట్ల రూపాయలతో కూడుకున్న బలమైన కోరిక.. ఈసారైనా నెరవేరుతుందా?

అసలైన మా ఎన్నికలు సమరం మొదలైంది. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఈసారి నెవ్వర్ బిఫోర్ అనేలా ముగ్గురు ప్రముఖుల మధ్య పోటీ జరుగుతుండటం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాలను తలపిస్తున్న మా ఎన్నికల్లో ప్రతిసారి ఒక బలమైన కోరిక హైలెట్ అవుతోంది. కోట్ల రూపాయలతో కూడుకున్న ఆ వ్యవహారం ఈ ఎన్నికల అనంతరం అయినా నెరవేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఆ ఒక్కటి తీరని కొరికగానే మిగిలిపోతోంది.

ఆ ఒక్కటి తీరని కొరికగానే మిగిలిపోతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మన స్టార్ హీరోల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. మార్కెట్ కూడా వందల కోట్లల్లో పెరిగుతోంది. అయితే అందరూ అనుకుంటే అయ్యే ఒకే ఒక్క పని మాత్రం గత కొన్నేళ్లుగా అలానే పెండింగ్ లో ఉంది. ప్రతిసారి ఎలక్షన్స్ లో అందరూ వాగ్దానం ఇస్తున్నప్పటికి ఆ ఒక్కటి తీరని కొరికగానే మిగిలిపోతోంది.

సొంత భవనం లేకపోవడంతో

సొంత భవనం లేకపోవడంతో

ఆ కోరిక మరేదో కాదు. మా సొంత భవనం. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో మొదలైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎంతోమందికి సహాయలు అందాయి. నామమాత్రంగా సహాయలు అందుతూనే ఉన్నప్పటికీ అసోసియేషన్ కు ఉండాల్సిన కనీసం సొంత భావనం అయితే లేదు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లోనే ఒక చిన్న కార్యాలయాన్ని నడుపుతున్నారు.

మంచి కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉన్నా..

మంచి కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉన్నా..

ఇదివరకు పదవిలో ఉన్నవారు శివాజీ రాజా, నరేష్ వంటి వాళ్ళు సొంత భవనం కోసం కూడా మాట్లాడారు కానీ ఎవరికి సాధ్యం కాలేదు. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 100కోట్ల ఆదాయం ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. కరెక్ట్ ప్లాన్ తో అడిగితే ఇవ్వడానికి ఎవరు కూడా వెనుకాడరు. టాప్ స్టార్స్ సీనియర్ స్టార్స్ ఎంతో కొంత ఇచ్చినా కూడా ఒక మంచి కార్యాలయాన్ని ఏర్పాటు చేయవచ్చు.

వీరితో అయినా సాధ్యమవుతుందో లేదో..

వీరితో అయినా సాధ్యమవుతుందో లేదో..

స్టార్ హీరోలు మాత్రమే కాకుండా ప్రభుత్వం కూడా అడిగితే ఎంతో కొంత సహాయం చేయకుండా అయితే ఉండదు. ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్, మాంచు విష్ణు, జీవిత రాజశేఖర్ అధ్యక్ష పదవిలో పోటీగా ఉన్న విషయం తెలిసిందే. మరి వారితో అయినా 'మా'కు సొంత భవన నిర్మాణం అనేది ఏర్పడుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే ప్రకాష్ రాజ్ పైనే ఉంది. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X