»   » ‘మా’ ఎన్నిక: దాసరిగారు సెటిల్ చేస్తారా?

‘మా’ ఎన్నిక: దాసరిగారు సెటిల్ చేస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : తెలుగు సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారానికి మందుండే వ్యక్తి గురువు గారు దాసరి. ఇప్పుడు మరోసారి ఆయన వైపు ఇండస్ట్రీ చూస్తోంది. తెలుగు సినీ నటుల సంఘమైన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌' (మా) ఎన్నికల్లో రసవత్తర ఘట్టానికి తెరలేచిన సంగతి తెలిసిందే. ఈ నెల 29న ‘మా' ఎన్నికలు జరగుతున్నాయి. అధ్యక్షుడిగా నటుడు రాజేంద్రప్రసాద్‌ ఏకగ్రీవ ఎన్నిక ఖాయమనుకుంటున్న దశలో, ఆఖరి నిమిషంలో నటి జయసుధ ఆయనకు పోటీగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్‌ ఆమెకు మద్దతు ప్రకటించారు. దీంతో ఇప్పుడు రెండు వర్గాలుగా ఈ ‘మా' ఎన్నికల్లో విడిపోనుందని అంటున్నారు సినీ పెద్దలు. అయితే దాసరిగారు కలగ చేసుకుని సెటిల్ చేస్తారని కొందరంటున్నారు. ఎందుకంటే రాజేంద్రప్రసాద్ కు, జయసుధకు ఇద్దరి మధ్యా మంచి రిలేషన్ ఉన్న వ్యక్తి దాసరి గారు.

ఈ పరిణామాలు సినీ వర్గాలను అమితాశ్చర్యంలో ముంచెత్తాయి. ఎందుకంటే.. సినీ పెద్దలు, సంఘ సభ్యులు తనకు సహకారం అందిస్తున్నందునే ‘మా' అధ్యక్షునిగా ఉండేందుకు నిర్ణయించుకున్నానని రాజేంద్రప్రసాద్‌ ఈ నెల 2న పత్రికా సమావేశంలో ప్రకటించారు. ముప్పై ఏడేళ్లుగా సినీ రంగంలో ఉన్న తాను, ఇదే రంగంలో ఉన్న కళాకారులకు ‘మా' అధ్యక్షుడిగా తన వంతు సేవ అందించాలనుకుంటున్నానని తెలిపారు.

MAA elections: Rajendra Prasad Vs Jayasudha

‘‘సేవా దృక్పథంతో ముందుకెళ్లాలనే కమిట్‌మెంట్‌తో, ఇది సరైన సమయమనే ఉద్దేశంతో, అందరికీ ఇష్టుడిగా, నా బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తాననే నమ్మకంతో ‘మా' అధ్యక్షుడిగా నిలబడబోతున్నా'' అని ఆయన చెప్పారు. గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో తల్లిలాంటి ‘మా'కు సొంత భవనం ఏర్పాటుచేయడమే తన ధ్యేయమన్నారు. కాగా, ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్‌ ఇష్టపడనందునే రాజేంద్రప్రసాద్‌ను ఏకగ్రీవం చేయాలని ‘మా' సభ్యుల్లో కొంతమంది భావించారు.

నాగబాబు, శివాజీరాజా, కాదంబరి కిరణ్‌, ఏడిద శ్రీరామ్‌ వంటివాళ్లు వారిలో ఉన్నారు. పోటీ లేకుండా తన ఎన్నిక ఏకగ్రీవమైతేనే బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేయడంతో, ఆయనకు మద్దతుగా ఉన్న ‘మా' సభ్యులు దానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొద్ది రోజుల ముందు అధ్యక్షునిగా మంచు విష్ణు పోటీ చేయబోతున్నారంటూ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రచారాన్ని విష్ణు ఖండించారు. ప్రస్తుతం తనకున్న కమిట్‌మెంట్ల వల్ల ఆ పదవికి వంద శాతం న్యాయం చేయలేనని, అందుకే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలేదని.. ఆయన ట్విటర్‌ ద్వారా తెలిపారు.

పైగా అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్‌ నిలబడుతున్నందున ఆయన సీనియారిటీని గౌరవిస్తూ, ఆయనకు మద్దతునిస్తానని కూడా విష్ణు చెప్పారు. దీంతో ‘మా' అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడమే తరువాయని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.

కానీ, ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా తెరపైకి జయసుధ వచ్చారు. ఆమెకు మురళీమోహన్‌ మద్దతు తెలపడం ఆసక్తికర పరిణామం. అంటే ‘మా'లోని ఆయన వర్గం జయసుధకు మద్దతుగా నిలిచే అవకాశాలున్నాయి. శుక్రవారం ఆమె నామినేషన్‌ వేయబోతున్నట్లు సమాచారం.

English summary
Rajendra Prasad announced his interest for the role of MAA president with the support of Nagababu who is also a well-known Tollywood actor, producer and the brother of Tollywood’s top performer hero, Chiranjeevi. Later, the actress Jayasudha has also announced her interest towards the MAA president position, with the support of former MAA president Murali Mohan.
Please Wait while comments are loading...