»   » మద్దెలచెరువు సూరి ...'రక్త చరిత్ర' చిత్రాన్ని ఎక్కడ చూస్తాడంటే...

మద్దెలచెరువు సూరి ...'రక్త చరిత్ర' చిత్రాన్ని ఎక్కడ చూస్తాడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజు విడుదల అవుతున్న రక్త చరిత్ర చిత్రాన్ని మద్దెల చెరువు సూరి బెంగుళూరు లో చూస్తాడని తెలుస్తోంది. పరిటాల రవి, మద్దెల చెరువు సూరి మధ్య జరిగిన వార్ ప్రధానంగా ఈ చిత్రం రూపొందటంతో సూరికి తనని ఏ విధంగా చిత్రంలో చిత్రీకరించారనే ఆసక్తి ఉండటం సహజం అంటున్నారు. మరో ప్రక్క ఇప్పటికే సూరి..ఈ చిత్రాన్ని రహస్యంగా చూడటం జరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో మద్దెల చెరువు సూరి పాత్రను తమిళ హీరో సూర్య చేస్తున్నారు. ఇక ఈ చిత్రం చూడటానకి సూర్య..హైదరాబాద్ వస్తే గొడవలు జరుగుతాయని అందుకే బెంగుళూరులో చూడటానికి ప్లాన్ చేసుకున్నాడని చెప్తున్నారు. ఇక పరిటాల సునీత మాత్రం ఈ చిత్రాన్ని అనంతపురంలోనే చూడాలని నిర్చయించుకున్నట్లు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu