»   »  మధుషాలిని ని మనోడు మళ్లి చేరదీసాడు

మధుషాలిని ని మనోడు మళ్లి చేరదీసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కితకితలు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మధుశాలినికి ఇక్కడ అవకాశాలు కరవయ్యాయి. పోనీ తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన 'వాడు-వీడు'చిత్రం అయినా కెరీర్ పరంగా కిక్ ఇస్తుంది అనుకుంటే అదీ కనపడలేదు. ఈ నేపధ్యంలో ఆమె దిగాలుగా ఉన్న సమయంలో రామ్ గోపాల్ వర్మ నుంచి పిలువు వచ్చింది.రామ్‌గోపాల్‌ వర్మ 'డిపార్ట్‌మెంట్‌'లో ఆమెకు చోటిచ్చాడు. అయినా ఆ సినిమాకు వర్కవుట్ కాకపోవటంతో ఆమె ఖాళి పడిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే వర్మ తన తాజా చిత్రంలో ఆఫర్ ఇచ్చి ఆమెకు బ్రేక్ ఇస్తానంటున్నాడు.

మంచు ఫ్యామిలీతో కలిసి రౌడీ చిత్రం తెరకెక్కించిన వర్మ తన తదుపరి చిత్రాన్ని సైతం మంచు విష్ణుతోనే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనే ఆమెకు అవకాసం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె జర్నలిస్టు గా కనిపించనుందని తెలుస్తోంది. ఈ చిత్రం టైటిల్ టెన్షన్...టెన్షన్ అని ప్రచారంలోకి వచ్చింది. అయితే అది కాదు అని వర్మ కొట్టిపారేసారు. అయితే ఇప్పుడు తాజాగా ...ఆ చిత్రానికి '13' అనే టైటిల్ ని ఖరారు చేసారని అంతర్గత వర్గాల సమాచారం. ఈ చిత్రంలో విష్ణు ..పోలీస్ గా కనిపించనున్నారు. చిత్రంలో ఐదుకి పైగానే ఫిమేల్ రోల్స్ ఉంటాయని తెలుస్తోంది.

Madhu Shalini : RGV-Vishnu's heroine finalized

'13' అని టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటంటే... విష్ణుకి ఇది 13 వ చిత్రం కావటం, 13 అనేది మిస్టీరియస్ సంఖ్య కావటం,తమ కథ కూడా క్రైమ్ తో నడిచే మిస్టరీ తరహా థ్రిల్లర్ చిత్రం కావటం,చిత్రంలోనూ 13 మర్డర్స్ ఉండటంతో అదే టైటిల్ ని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది. అలాగే అంకెతో టైటిల్ కావటంతో జనాల్లోకి బాగా వెళ్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ఈ విషయమై ఏ విధమైన సమాచారం లేదు.

వర్మ మాట్లాడుతూ.... విష్ణుతో ఇంకో సినిమా చేస్తున్నాను. కానీ దాని పేరు టెన్షన్‌ కాదు.. అటెన్షన్‌ కాదు. సినిమా పూర్తయ్యాక పేరు చెప్తాను. మరో కథ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాను అని చెప్పారు.

English summary

 
 Ram Gopal Varma is directed Manchu Vishnu in the film tentatively titled 13. According to the sources Madhu Shalini who was seen in RGV's Department will be playing the female lead in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu