Spirit Movie: ప్రభాస్ స్పిరిట్ లో మరో క్రేజీ హీరోయిన్.. సందీప్ రెడ్డి వంగా మాస్టర్ ఫ్లాన్
Spirit Movie: గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో పెట్టారు. అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు గట్టిగానే ప్లాన్ చేసాడు. ప్రస్తుతం'రాజాసాబ్','ఫౌజీ'సినిమాల పనులను పూర్తి చేస్తున్నాడు. అతి త్వరలో 'రాజాసాబ్'మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు డార్లింగ్. ఇప్పటికే విడుదలైన టీజర్, టైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ ముందు మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'స్పిరిట్'. యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా గురించి తాజా అప్డేట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం తీసుకవచ్చింది. ఇంతకీ ఆ శుభవార్త ఏంటీ?
షూటింగ్ అప్‌డేట్:
గత కొన్ని సంవత్సరాల క్రితం సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని సందీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినప్పటికీ, ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. 'స్పిరిట్'నవంబర్ 5 నుంచి షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రభాస్ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా థ్రిల్లింగ్, పవర్‌ఫుల్ యాక్షన్, డ్రామా, ఎమోషన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డార్లింగ్ అభిమానులు ఇప్పటికే 'స్పిరిట్'కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, భారీ యాక్షన్, ఫిక్షనల్ డ్రామా, ఎమోషనల్ కాంపోనెంట్‌తో సినిమా నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతున్నారని హైలెట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ త్రుప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో గెస్ట్ అపిరియన్స్ ఇవ్వనున్నారట. అలాగే.. సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయం స్పిరిట్ హైప్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలు పుకార్లే అని తెలుస్తోంది. తాజాగా హీరోయిన్ విషయంలో కూడా ఇలాంటి వార్త వైరల్ అవుతోంది.

హీరోయిన్ ఎంపిక:
మొదటగా హీరోయిన్‌గా దీపికా పదుకొణెను తీసుకోవాలని పరిశీలించగా, ఆమె పెట్టిన కొన్ని షరతులు నిరాకరించడంతో త్రుప్తిడిమ్రి ఆమె స్థానంలో ఫైనల్ అయ్యారు. అంతేకాక, ప్రభాస్ మూవీలో మలయాళ్ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ను కూడా కాస్ట్‌లో చేర్చుకున్నారట. ముందుగా ఈ పాత్రకు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ను పరిగణనలోకి తీసుకుని డిజైన్ చేశారంట. కానీ, చివరికి మడోన్నా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆమె సెకండ్ హీరోయిన్ గా ఉంటుందా ? లేదా ప్రతినాయక పాత్రలో నటించబోతుందా? అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.
మడోన్నా సెబాస్టియన్ కెరీర్:
మడోన్నా తన సినిమా ప్రయాణాన్ని మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో ప్రారంభించింది. తర్వాత తమిళ చిత్రాలూ, తెలుగు రీమేక్‌లలోనూ నటించింది. ముఖ్యంగా తెలుగులో 'ప్రేమమ్' రీమేక్‌లో నాగచైతన్య సరసన నటించింది. తర్వాత 'శ్యామ్ సింగరాయ్' లీడ్ రోల్ నటించింది. ఇప్పుడు ప్రభాస్ సరసన 'స్పిరిట్'లో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఒకే వేళ ఈ వార్త నిజమైతే.. ఆమె కెరీర్‌లో స్పిరిట్ ఓ మైలురాయిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే స్పిరిటీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











