»   » 2009 ఉత్తమ నటుడు 'రామ్ చరణ్', ఉత్తమ చిత్రం 'మగధీర'?

2009 ఉత్తమ నటుడు 'రామ్ చరణ్', ఉత్తమ చిత్రం 'మగధీర'?

Posted By:
Subscribe to Filmibeat Telugu

2008వ సంవత్సరానికి సంబంధించి నంది అవార్డుల కార్యక్రమం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో 2009వ సంవత్సరానికి నంది ఎవరిని వరిస్తుందా అనే ఆశక్తికర చర్చనడుస్తోంది. ప్రతీ చర్చలోనూ మెగాస్టార్ పుత్రరత్నం రామ్ చరణ్ తేజ్ కే ఉత్తమ నటుడి అవార్డు వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మగధీర సినిమాలో చరణ్ కనబరచిన అద్భుతమయిన నటనకు ఖచ్చితంగా నంది దక్కుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇక మిగతా విభాగాల్లో ఒక్క శ్రీకాంత్, కృష్ణ వంశీ ల కాంబినేషన్ లో వచ్చిన మహాత్మ ఒక్కటే అంతో ఇంతో పోటీని ఇవ్వగలదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆ తర్వాత ఉత్తమ చిత్రంగా మగధీర, ఉత్తమ దర్శకుడిగా యస్ యస్ రాజమౌళి ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి మీరేమంటారు..??

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu