»   » 'మగధీరు'డు బ్రహ్మానందం..యువరాణి మిత్రవింద అనుష్క

'మగధీరు'డు బ్రహ్మానందం..యువరాణి మిత్రవింద అనుష్క

Subscribe to Filmibeat Telugu

అరుంధతి సినిమా తర్వాత అనుష్క నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా పంచాక్షరి. సముద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అనుష్క, నాగార్జునల వ్యక్తిగత మేకప్ మ్యాన్ చంద్ర నిర్మిస్తుడగా నాగర్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఆశక్తికర విషయం బయటపడుతోంది. అనుష్క ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆమె పల్లెటూరి పిల్ల పంచాక్షరిగా, పట్నం పోరి హనీగా రెండు విభిన్నమయిన పాత్రలు చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశం మగధీర సినిమాకు పేరడీగా రూపొదిందట. ఈ పేరడీ అనుష్క, బ్రహ్మానందంల మధ్య జరుగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా బ్రహ్మానందమే వెళ్లడించాడు. అసలు బ్రహ్మీని చూడగానే నవ్వొస్తుంది. అలాంటిది మగధీర లాంటి పవర్ ఫుల్ పాత్రలో కామెడీని ఏ రకంగా పండించాడో ఊహించుకుంటేనే నవ్వొస్తోంది కదూ.. మరి మగధీరుడిగా బ్రహ్మీ, మిత్రవిందగా అనుష్క ఎలా కామెడీ చేసారో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu