For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ముగ్గురు స్టార్ట్ హీరోయిన్స్ కాదన్నారు... ఫేడవుట్ హీరోయిన్ కటౌట్ తో పని కానిచ్చిన అజయ్ భూపతి !

  |

  ఆర్ఎక్స్ 100 అనే బోల్డ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దర్శకుడు అజయ్ భూపతి. వర్మ దగ్గర శిష్యుడిగా పనిచేసిన ఆయన కిల్లింగ్ వీరప్పన్ సహా రక్త చరిత్ర, రక్త చరిత్ర 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ అనుభవంతో ఆర్ఎక్స్ 100 అనే సినిమాను తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నాడు. అయితే భారీ హిట్ సినిమా అందుకున్నా కూడా ఈ దర్శకుడు మరో సినిమాని పట్టా లెక్కించడానికి చాలా సమయం పట్టింది.

  ప్రస్తుతం ఆయన మహాసముద్రం పేరిట ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో సిద్ధార్థ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయమని ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ని అడిగితే వారు ఎవరూ చేయమని చెప్పారట. దీంతో ఒకప్పటి హీరోయిన్ కటౌట్స్ పెట్టి పని పూర్తి చేశాడట దర్శకుడు. ఆ వివరాల్లోకి వెళితే

  వర్థమాన తార నైనిషా బ్యూటిఫుల్ గ్యాలరీ..

  అజయ్ భూపతి కి ఆఫర్స్ వెల్లువలా

  అజయ్ భూపతి కి ఆఫర్స్ వెల్లువలా

  ఆర్ఎక్స్ 100 సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కావడంతో దర్శకుడు అజయ్ భూపతి కి ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడ్డాయి. ఈ దర్శకుడు స్టార్ హీరోని డైరెక్ట్ చేయడం ఖాయం అని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆయన చాలామందితో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేసినా ఏదీ వర్కౌట్ కాలేదు. రవితేజ, నాగచైతన్య లాంటి హీరోలకు కథలు వినిపించినా చివరి నిమిషం దాకా ఓకే అనుకున్నవి కూడా క్యాన్సిల్ అయ్యాయి. చివరికి ఆయన చెప్పిన కథ విని శర్వానంద్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మహాసముద్రం పేరుతో ఆ సినిమా తెరకెక్కుతోంది.

  శర్వానంద్ - సిద్దార్ద హీరోలుగా

  శర్వానంద్ - సిద్దార్ద హీరోలుగా

  విశాఖ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ కథకు మరో హీరో పాత్ర అవసరం కావడంతో హీరో సిద్ధార్థ సంప్రదించారు. ఆయన కూడా నటిస్తానని ఒప్పుకోవడంతో ఇద్దరూ ప్రస్తుతానికి ఈ ఇద్దరూ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా అదితి రావు హైదరి అను ఇమ్మానుయేల్ ఇద్దరిని ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

  ముగ్గురు హీరోయిన్స్ ను సంప్రదించగా

  ముగ్గురు హీరోయిన్స్ ను సంప్రదించగా

  అయితే మన తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కు ఉన్న క్రేజ్ చెప్పదగ్గది కాదు. కొన్నాళ్ల క్రితం వరకు అయితే సినిమాల్లో ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ ఉంటేనే సినిమా అనేంతలా ప్రతి సినిమాలోనూ ఐటెమ్ సాంగ్ మెరిసేది. ఇప్పుడు కాస్త ఆ ట్రెండ్ తగ్గింది అని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా దర్శకుడు ఈ సినిమాలో మాత్రం ఒక మంచి ఐటెం సాంగ్ ఉండాలని భావించారు. అయితే ఆ ఐటం సాంగ్ కూడా ఒక స్టార్ హీరోయిన్ చేస్తే సినిమాకు మరింత లాభం చేకూర్చేదిగా ఉంటుందని భావించారు. అందులో భాగంగానే ఆయన రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, శృతి హాసన్ వంటి హీరోయిన్స్ ను సంప్రదించగా వారు ముగ్గురు స్పెషల్ ఐటం సాంగ్స్ చేయమని చెప్పారట.

  Acharya లో ఆ రెండు చోట్లా గూస్‌బమ్స్ ఖాయం| Acharya Movie Updates
  కటౌట్స్ తో పని కానిస్తున్నాడు

  కటౌట్స్ తో పని కానిస్తున్నాడు

  దీంతో ఏం చేయాలా అని చాలా తర్జనభర్జనలు పడిన అజయ్ భూపతి చివరికి ఒకప్పటి హీరోయిన్ రంభను వాడుకోవడానికి సిద్ధమయ్యారు. రంభ మీద ఒక పాట ప్లాన్ చేశారని ఆ పాటనే స్పెషల్ ఐటంగా తీర్చిదిద్దుతారు అని అంటున్నారు. ఆ పాటలో రంభ కటౌట్స్ తో పని కానిస్తారు అని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు రంభకు వీరాభిమానిగా కనిపిస్తాడట.. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జగపతిబాబు, శర్వానంద్ ఇద్దరితో కలిపి రంభ కటౌట్స్ తో ఒక సాంగ్ షూట్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. అలా ముగ్గురు హీరోయిన్స్ కాదన్నా సరే రంభ కటౌట్ తో దర్శకుడు పని కానిస్తున్నాడు అన్నమాట.

  English summary
  Director Ajay Bhupathi‘s upcoming film ‘Maha Samudram‘ is getting ready for release. Rakul Preet, Kajal and Sruthi Hassan- rejected to do a special song in the film. As per a source, the makers made song tribute to actress Rambha. in which only her cut-out and photos appear.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X