»   » 'నేరం'లోకి ఇంకో హీరోని లాగిన సందీప్

'నేరం'లోకి ఇంకో హీరోని లాగిన సందీప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తమిళంలో ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న 'నేరం' చిత్రాన్ని తెలుగులో రూపొందించనున్నట్లు సందీప్‌ కిషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంలో మరో హీరో చేరారు.

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రం చేసి ఇప్పుడు షి అనే క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్న మహత్ రాఘవేంద్ర ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రను పోషించటానికి కమిటయ్యారని తెలుస్తోంది. మహత్ కు, సందీప్ కిషన్ కు ఉన్న స్నేహంతో మహత్ ఈ చిత్రం చేస్తున్నట్లు చెప్తున్నారు.

Mahat in Sundeep Kishan’s Neram remake

అసాధ్యుడు, మిస్టర్‌ నూకయ్య తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్‌ కన్నెగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నటుడు సందీప్‌ తెలిపారు.

2013లో చాలా చిన్న సినిమాగా వచ్చితమిళం, మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా ‘నేరం'. నేరమ్ చిత్రం తమిళ,మయాళ భాషల్లో ఇప్పటికే విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదొక డార్క్ కామెడీ చిత్రం. నాగ చైతన్య చేస్తున్న రీమేక్... ఒరిజనల్ ప్రేమమ్ చిత్రం దర్శకుడు తొలి చిత్రం ఇది. ఈ చిత్రంతోనే అతనికి మంచి పేరు వచ్చింది. నజ్రియా నసీమ్, నవీన్ పోలి ఈ సినిమాలో చేసారు.

Mahat in Sundeep Kishan’s Neram remake

తెలుగులో "123"టైటిల్ తో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మిస్టర్ నోకియా చిత్రం మంచు మనోజ్ చేసిన దర్శకుడు అనీల్ ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నారు. నేరం అంటే టైం అని అర్దం. గతంలో ఈ చిత్రాన్ని దాసరి గారు తన కుమారుడు అరుణ్ కుమార్ తో చేద్దామనుకున్నారు. కానీ ఎందుకనో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు.

ఇక ఈ చిత్రాన్ని ఫిక్సెల్ ఇండియా ప్రెవేట్ లిమెటెడ్ హెడ్ చెరుకూరు సుధాకర్ ఈ సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల సుంకర సమర్పిస్తున్నారు.

English summary
Sundeep Kishan is remaking the Tamil/Malayalam Super hit film Neram. Recently, Mahat has been approached to play a guest role for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X