For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హాట్ టాపిక్ : ‘1’ (నేనొక్కడినే) కథ ఇదా?

  By Srikanya
  |

  హైదరాబాద్ :మహేష్‌బాబు హీరోగా 14 రీల్స్ పతాకం, ఈరోస్ ఇంటర్నేషనల్ పతాకాలపై సం యుక్తంగా సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన '1' (నేనొక్కడినే) రేపు భారీ ఎత్తున విడుదల కాబోతోంది. మహేష్‌బాబు నటన, సుకుమార్ సరికొత్త స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని చెప్పబడుతున్న ఈ చిత్రం కథ అంటూ తాజాగా ఒకటి ప్రచారంలోకి వచ్చింది.

  ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న కథ ప్రకారం..మహేష్..లండన్ లో ఓ కాన్ఫిరెన్స్ కు వెళతాడు. అక్కడ హోటల్ లో లవర్ కీర్తి మిస్సవుతుంది. దాన్ని ఛేధిస్తూ వెళ్తూంటే వెనక పెద్ద కుట్ర ఉన్నట్లు బయిటపడుతుంది. ఆమెను అంతటా వెతుకుతూ ఎక్కి వచ్చిన క్యాబ్ డ్రైవర్ ని, తిరిగిన మిగతా ప్రదేశాలను, ఎంక్వైరీ చేస్తూంటే అందంతా అతని భ్రమే తప్ప మరొకటి కాదని, అతను మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోయాడని అర్దమవుతుంది. అయితే అది నమ్మబుద్దికాదు. ఓ చిన్న క్లూతో..అసలేం జరిగిందో ఎలా కనుక్కున్నాడో...అసలేం జరిగింది..ఆమె ఏమైంది అనే విషయాలతో కథనం థ్రిల్లింగ్ గా నడుస్తుంది. అయతే ఇదే కథ నిజమా కాదా అన్న విషయం తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే.

  Mahesh ’1-Nenokkadine’ story leaked

  ఇంట్నేషనల్ స్టాండర్డ్స్‌కు ఏ మాత్రం తగ్గనివిధంగా చిత్రాన్ని రూపొందించామని ఆయన అన్నారు. మూసధోరణిలో కాకుండా సినిమా అంతా సరికొత్త స్క్రీన్‌ప్లేతో సాగుతోందని, ఓ రకంగా హాలీవుడ్‌రేంజ్‌లో టాలీవుడ్‌లో నిర్మించిన సినిమా ఇదని మరో నిర్మాత అనీల్ సుంకర తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఆడియో వేడుకలు జరపడం ఈ చిత్రానికి సరికొత్త ఇమేజ్ తెచ్చిందని, సినిమా విశేషాలు అందరికీ చేరువయ్యేలా మరో రెండ్రోజుల్లో యాప్‌ను, ఓ గేమ్‌ను విడుదల చేయనున్నామని, అలాగే హీరో వాడిన బైక్‌ను ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా ప్రేక్షకులు గెలుచుకునే ఏర్పాట్లు కూడా చేశామని ఆయన అన్నారు.

  కృతిసనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నాజర్, ప్రదీప్ రావత్, కెల్లీ డోర్జి, షాయాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సూర్య, బెనర్జి, చైతన్య మరియు మాస్టర్ గౌతమ్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కథ:జక్కా హరిప్రసాద్, మాట లు: అర్జున్. వై.కె, శ్రీను తోట, పాటలు:చంద్రబోస్, డాన్స్:ప్రేమ్ రక్షిత్, ఫైట్స్:పీటర్ హేన్స్, ఎడిటింగ్:శివ శరవణన్, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు:రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీ ల్ సుంకర, దర్శకత్వం:బి.సుకుమార్.

  English summary
  
 Mahesh visits London for a conference and loses his lover Kirti from the hotel room and rest is all about how he tracks her down and finds a big conspiracy behind it. Unable to find her after meeting a cab driver, hotel and other spots, he even begins to believe that lover was just an imagination and loses his balance of mind, but with small clue, he recovers his past. one NenokkadineMovie is Directed by Sukumar an Action Entertainer.This Movie is Going to Release on Jan 10th 2014.Movie is Produced by 14Reels.Kirti Sonan is the Female Lead In this Movie.Devi sri Prasad is the Music Director.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more