SSMB28: మహేష్ బాబు అభిమానుల కోసం సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసిన త్రివిక్రమ్.. గెట్ రెడీ.. డేట్ ఫిక్స్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని స్టార్ హీరోలందరికి ఒకప్పుడు చాలా కోరికగా ఉండేది. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా ఆలోచనలో పడి స్టార్ హీరోల ఆలోచన కూడా మారుతూ వస్తోంది. దర్శకుడు ఎవరైనా సరే కథ ఎంత బలంగా ఉంది అని పాయింట్ పైనే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. త్రివిక్రమ్ కూడా హీరోల రేంజ్ కు తగ్గట్లుగానే కథలను రాస్తున్నాడు. ఇక మహేష్ బాబు కోసం ఈ సారి నెవర్ బిఫోర్ అనేలా కథను సెట్ చేసినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఒక స్పెషల్ సర్‌ప్రైజ్‌ కు ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

అలాంటి సినిమా ఈ రోజుల్లో వచ్చి ఉంటే

అలాంటి సినిమా ఈ రోజుల్లో వచ్చి ఉంటే

మహేష్ బాబులోని ఒక విభిన్నమైన నటుడిని తీసుకు వచ్చిన దర్శకులతో త్రివిక్రమ్ ఒకరు. అతడు సినిమాలో మహేష్ నటన ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాంటి సినిమా ఈ రోజుల్లో వచ్చి ఉంటే బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసేది. ఇక ఆ తరువాత వీరి కాంబోలో వచ్చిన ఖలేజా సినిమా డిజాస్టర్ అయినా కూడా మహేష్ లోని ఫుల్ కామెడీ టైమింగ్ ఆ సినిమాతోనే బయటకు వచ్చింది.

 రిస్క్ లేకుండా పవర్ఫుల్ కథతోనే

రిస్క్ లేకుండా పవర్ఫుల్ కథతోనే

ఇక ఈసారి త్రివిక్రమ్ రిస్క్ లేకుండా పవర్ఫుల్ కథతోనే రాబోతున్నాట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సడన్ గా తప్పుకోవడంతో వెంటనే మహేష్ ను లైన్ లో పెట్టాడు. మహేష్ ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని ఫిక్స్ అయ్యాడు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయట.

హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్

హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్

మహేష్ బాబు 28వ ప్రాజెక్టుగా రానున్న ఈ సినిమాలో మహేష్ ఒక RAW ఏజెంట్ గా కనిపిస్తాడని, అతడు సీక్వెల్ అని ఎన్నో రకాల రూమర్స్ అయితే వచ్చాయి. రూమర్స్ సంగతి ఎలా ఉన్నా కూడా మహేష్ అతడు కంటే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఇక ఎప్పటిలానే ఇద్దరు హీరోయిన్స్, ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామాను కూడా ప్లాన్ చేసినట్లు టాక్ వస్తోంది.

Recommended Video

Bigg Boss 4 Contestant Monal Gajjar In Dance Reality Show
 మే 31న సర్‌ప్రైజ్‌

మే 31న సర్‌ప్రైజ్‌

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే సినిమా కాన్సెప్ట్ పోస్టర్ అలాగే పాన్ ఇండియా తరహాలోనే సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X