»   » మహేష్ బాబును ముఖ్యమంత్రిగా చూడబోతున్నామా?

మహేష్ బాబును ముఖ్యమంత్రిగా చూడబోతున్నామా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబును త్వరలో మనం ముఖ్యమంత్రిగా చూడబోతన్నామా? అంటే అవుననే సమాధానమే వినిస్తోంది. అయితే అభిమానులెవరూ కంగారుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంటే ఆయేన రాజకీయాల్లోకి ఏమీ రాడం లేదు. ఆయన తెరపై మాత్రమే ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారట.

చిరంజీవి-పవన్ కళ్యాణ్ దత్తన్న కూతురు పెళ్లి వేడుకలో (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమాల్లో కూడా రాజకీయ నాయకుడిగా కనిపించలేదు. కానీ 'దూకుడు' సినిమాలో తన తండ్రి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఎమ్మెల్యేగా నాటకం ఆడే పాత్రలో చూసాం. అయితే త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారట.

సూపర్ స్టార్ సీఎంగా... సూపర్ అంతే

సూపర్ స్టార్ సీఎంగా... సూపర్ అంతే

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే మూవీలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారని, సినిమా కథ ప్రకారం అనుకోకుండా ఆయన రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందని, సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది.

సోషల్ ఎలిమెంట్స్

సోషల్ ఎలిమెంట్స్

శ్రీమంతుడు సినిమాలో అదిరిపోయే సామాజిక అంశంతో మహేష్ బాబు అభిమానులను, ప్రేక్షకులను మెప్పించిన కొరటాల శివ.... ఈ సారి రాజకీయాలకు సంబంధించిన అంశంతో డిఫరెంటుగా ట్రై చేస్తున్నారని టాక్.

సినిమాలో హైలెట్

సినిమాలో హైలెట్

శ్రీమంతుడు సినిమాలో... ఊరికి ఉంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే కాన్సెప్టు హైలెట్ అయినట్లే, ఇందులోనూ అలాంటి ఒక హైలెట్ అయ్యే ఎలిమెంటును కొరటాల శివ చూపించబోతున్నారని, ఈ సినిమాపై మహేష్ బాబు ఎంతో ఎగ్జైట్మెంటుతో ఉన్నారని, తన కెరీర్లో శ్రీమంతుడును మించిన హిట్ ఈసినిమా అవుతుందనే నమ్మకంతోనే ఉన్నారని అంటున్నారు.

దానయ్య

దానయ్య

డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌ 9 ఉదయం 10.26 గం.లకు రామానాయుడు స్టూడియోలో దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి ప్రముఖ నిర్మాత ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి క్లాప్‌ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

శ్రీమంతుడు కంటే పవర్ ఫుల్

శ్రీమంతుడు కంటే పవర్ ఫుల్

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ - ''శ్రీమంతుడు లాంటి సూపర్‌ మూవీ తర్వాత మహేష్‌బాబు లాంటి సూపర్‌స్టార్‌తో శ్రీమంతుడు కంటే పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో తీస్తున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా వుంటుందని తెలిపారు

కీర్తి సురేష్

కీర్తి సురేష్

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించబోతున్నారు. ఇకా భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేయబోతున్నారు.

వచ్చే దసరా కానుకగా సినిమా రిలీజ్

వచ్చే దసరా కానుకగా సినిమా రిలీజ్

''మహేష్‌బాబు గారితో ఓ సెన్సేషనల్‌ మూవీ చెయ్యాలన్న నా చిరకాల కోరిక ఈ ప్రాజెక్ట్‌తో నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. వరసగా ఘనవిజయాల్ని అందిస్తున్న కొరటాల శివగారి దర్శకత్వంలో ఇంత మంచి సినిమా చేస్తున్నందుకు గర్వంగా వుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా ఈ చిత్రం నిర్మాణం అవుతుంది. పిబ్రవరిలో షూటింగ్ మొదలు పెట్టి 2017 దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ రవి కె.చంద్రన్‌ మాట్లాడుతూ

సినిమాటోగ్రాఫర్‌ రవి కె.చంద్రన్‌ మాట్లాడుతూ

''మూడేళ్ళ క్రితం ట్విట్టర్‌లో నా అభిమాన హీరో మహేష్‌ అని ట్వీట్‌ చేశాను. ఇప్పుడు మహేష్‌తో కలిసి వర్క్‌ చేయడం చాలా ఎక్సైటింగ్‌గా వుంది. మహేష్‌, కొరటాల శివగార్ల కాంబినేషన్‌లో ఈ చిత్రం టెక్నికల్‌గా హై రేంజ్‌లో వుంటుందన్నారు. ఇంతకుముందు నేను ఎన్నో భారీ చిత్రాలు చేసినా కూడా నా అభిమాన హీరోతో చేస్తున్న ఈ సినిమాకి నూతనోత్సాహంతో వర్క్‌ చేస్తాను'' అన్నారు.

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..(ఫోటోలు, వివరాల కోసం క్లిక్ చేయండి)

మహేష్ బాబు లాంటి మొగుడ్ని కోరకునే అమ్మాయిలు: సంపూ సెటైర్!

మహేష్ బాబు లాంటి మొగుడ్ని కోరకునే అమ్మాయిలు: సంపూ సెటైర్!

ఈ తరం తెలుగు అమ్మాయిలను మీకు ఎలాంటి భర్త కావాలని అంటే.... చాలా మంది మహేష్ బాబు లాంటి అందగాడు కావాలని చెబుతుంటారు. అయితే అలాంటి కోరికలు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!

ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!

ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!.... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

English summary
Film Nagar source said that, Mahesh Babu as Chief Minister in his next movie with Koratala Shiva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu