»   » రూ 1.5 కోట్లు : మహేష్ బాబు ‘తానా’ తందానా!

రూ 1.5 కోట్లు : మహేష్ బాబు ‘తానా’ తందానా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు ఆయన సినిమాల్లో తప్ప బయట కనబపడటమే అరుదు. ఆయన ఏదైనా సినిమా ఫంక్షన్ కు హాజరైనా...ఏదైనా షోరూం ప్రారంభోత్సవానికి వచ్చినా అభిమానుల తాకిడి ఎలా ఉంటుందో కొత్తగాచెప్పక్కర్లేదు. అందుకే పలు కార్పొరేట్ సంస్థలు మహేష్ బాబుతో పోటీ పడటానికి పోటీ పడుతున్నాయి.

ఇక విదేశాల్లో ఉండే తెలుగు వారు సైతం మహేష్ బాబు అంటే పడి చస్తారు. అందుకే ఆయన సినిమాలకు అక్కడ భారీ కలెక్షన్లు వస్తుంటాయి. అమెరికాలో తెలుగువాళ్లు చేసే ఉత్సవాల్లో 'తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) వేడుకలు' చాలా ఫేమస్. ఇక్కణ్ణుంచి ప్రముఖ తారలను అతిథులుగా పిలిచి, అక్కడి తెలుగువారిని ఆనందపరుస్తుంటారు తానా వేడుకల నిర్వాహకులు.

 Mahesh Babu to attend TANA 2015

ఈ ఏడాది జూలైలో అమెరికాలోని డెట్రాయిట్ లో ఓ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా మహేష్ బాబుని కోరారట. ఆయన ఓకే కూడా చెప్పారు. ఇందుకుగాను గౌరవ వేతనం కింద మహేష్ బాబుకి గంటలకు రూ. 50 లక్షల చొప్పున 3 గంటలకు రూ. 1.5కోట్లు తానా అసోసియేషన్ వారు ఇస్తున్నారట. మహేష్ బాబు ఈ మొత్తాన్ని "Heal A Child Organization" కోసం డొనేట్ చేయనున్నారట. ఈ స్వచ్ఛంద సంస్థ కోసం మహేష్ బాబు భార్య నమ్రత గత కొంత కాలంగా పని చేస్తోంది. చిన్నపిల్లల కోసం ఈ సంస్థ పని చేస్తోంది.

మహేష్‌ హీరోగా మైత్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 8.1 కోట్లకు ఓవర్ సీస్ రైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది. ఈ రేటు ఆల్ టైమ్ రికార్డు ప్రైస్ గా చెప్తున్నారు. నిర్మాత పార్టనర్ నవీన్...ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. మహేష్ కు ఓవర్ సీస్ లో పెరిగిన బిజినెస్ దృష్ట్యా ఈ రేటు పలికినట్లు తెలుస్తోంది. తానా వేడుకల్లో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టనున్నారట.

English summary
If the grapevine is to be believed, Mahesh Babu has accepted to grace TANA Celebrations and his wife Nirmatha is busy in preparing his tour schedule. Sources added that TANA members are going to present 1.5 Crores cheque to Mahesh as Thanks giving gift for attending the event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu