»   » పివిపి నష్టాలను మహేష్ బాబు ఇలా పూడుస్తారట!

పివిపి నష్టాలను మహేష్ బాబు ఇలా పూడుస్తారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బ్రహ్మోత్సవం' సినిమా ప్లాపు సంక్షోభం నుండి పివిపి సంస్థను బయట పడేసేందుకు మహేష్ బాబు నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతో భారీగా నష్టాల పాలైన ఆ సంస్థను గట్టెక్కించేందుకు ఆ సంస్థతో మహేష్ బాబు మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఫ్యామిలీతో యూకె వెకేషన్లో ఉన్న మహేష్ బాబు జూన్ 20న తిరిగి హైదరాబాద్ వస్తారు. వచ్చిన వెంటనే ఆయన మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత పివిపి సంస్థ నష్టాలు పూడ్చేందుకు మరో సినిమా చేయబోతున్నారు.

Mahesh Babu to do one more film with PVP

పివిపి సంస్థతో మహేష్ బాబు చేయబోయే మరో సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఇంకా అఫీషియల్ సమాచారం ఏదీ లేదు. బ్రహ్మోత్సవం బిజినెస్ క్లోజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం పివిపి సినిమాస్ అధినేత ప్రసాద్ వి పొట్లూరి... బ్రహ్మోత్సవం చిత్రానికి సంబందించిన లెక్కలు తేల్చే పనిలో బిజీగా ఉన్నారు. 'బ్రహ్మోత్సవం' సినిమాను తొలివారం పూర్తయిన తర్వాత చాలా వరకు థియేటర్లలో తీసేసారు. మరో వారం రోజుల్లో సినిమా బిజినెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్మెంట్ చేసే పనిలో నిగమగ్నమై ఉన్నారు.

English summary
Mahesh Babu’s ‘Brahmotsavam’ failed big time as box office. PVP Cinemas banner who produced this biggest family entertainer were quite unhappy with the result. Many rumors were out that PVP banner will stop producing films. Keeping aside all the rumors, PVP Cinemas banner is in talks with Mahesh Babu for next film. It is learnt that Mahesh Babu and PVP banner had an agreement of two feature films.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu