»   » ‘ఖలేజా’ కోసం మహేష్ ఎంత రగడ చేశాడు...?

‘ఖలేజా’ కోసం మహేష్ ఎంత రగడ చేశాడు...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఖలేజా" టైటిల్ కోసం మహేష్, త్రివిక్రమ్ అంత పట్టుబట్టడం, టైటిల్ ఇవ్వనన్న ప్రొడ్యూసరికి ఝలక్ ఇస్తూ 'మహేష్ ఖలేజా" అని టైటిల్ రిజిష్టర్ చేయడం, ఆ కేసు కోర్టుకెళితే దానిని ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేసుకోవడం చూసి..'ఖలేజా" అనే టైటిల్ ఈ చిత్రానికి చాలా యాఫ్ట్ ఏమో అనుకున్నారంతా. అందుకే అంతగా పట్టుబట్టి మరీ ఈ పేరు పెట్టుకున్నారేమోనని టైటిల్ అంత క్లాస్ గా లేకపోయినా సరిపెట్టుకున్నారంతా.

కానీ సినిమాచూస్తే అసలు టైటిల్ కీ, కథకీ పొంతనే లేదు. ఏదో ఒక పేరు పెట్టాలన్నట్టుగా ఈ పేరు పెట్టారనిపించిందే తప్ప ఎక్కడా 'ఖలేజా"కి జస్టిఫికేషన్ జరగలేదు. పోనీ 'జల్సా" మాదిరిగా సినిమా మూడ్ కి తగ్గట్టుగా ఈ పేరు పెట్టారా అంటే అదీ లేదు. 'ఖలేజా" అని మాస్ టైటిల్ తో అచ్చమైన క్లాస్ కామెడీ సినిమా తీసి వదిలారు. 'ఖలేజా" అని టైటిల్ పెట్టడంతో పాటు ఇది పూర్తి స్థాయి యాక్షన్ సినిమా అన్నట్టుగా ట్రెయిలర్స్ కట్ చేసి హంగామా చేశారు.

కానీ కామెడీ సినిమా మధ్య పాటలొచ్చినట్టుగా పైట్లు కూడా ఉన్నాయే తప్ప ఏరకంగా చూసినా ఇది మాస్ ఆడియన్స్, యాక్షన్ లవర్స్ టేస్ట్ కి తగ్గట్టు లేనే లేదు. అలాంటిది మరి అరవ అనువాద సినిమా టైటిల్ లా సౌండింగ్ ఉన్న 'ఖలేజా"కోసం ఎందుకంత గొడవ చేశారో తెలీడం లేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి 'దేవుడు", 'నేను దేవుడ్ని" టైటిల్స్ లో ఏదో ఒకటి పెట్టి ఉంటే బాగుండేదని కొందరు సూచిస్తున్నారు. ఆ టైటిల్స్ పెట్టుకుందామన్నా అవి రెండూ సూపర్ ప్లాప్ సినిమాల టైటిల్స్ కనుక దైర్యం చేయలేకపోయారేమో మరి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu