»   » నిజమా? :అరవింద స్వామికి... మహేశ్ బాబు షాక్ ఇచ్చాడా..ఆ విషయంలో

నిజమా? :అరవింద స్వామికి... మహేశ్ బాబు షాక్ ఇచ్చాడా..ఆ విషయంలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడు తెలుగు ఫిల్మ్ సర్కిల్స్ లో, మీడియా సర్కిల్స్ లో ఓ హాట్ టాపిక్ రన్ అవుతోంది. అదేమిటంటే...తమిళ నటుడు అరవింద్ స్వామికి ..మన సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విస్ట్ ఇచ్చారని. అదెలా జరిగింది..ఆయనకూ , మన ప్రిన్స్ మధ్య ఏం జరిగింది. ఇద్దరూ కలసి ఒక్క సినిమా కూడా చెయ్యలేదే అనేగా మీ డౌట్. ఇందుకు సమాధానం మీకు మీడియాలో ప్రచారం జరుగుతున్న కథనం చదివితే అర్దం అవుతుంది.

రీసెంట్ గా విడుదలైన రామ్ చరణ్ ధృవ సినిమాలో విలన్ గా చేసిన అరవింద్ స్వామి ... హీరోకు మించిన నటనతో తెలుగు ప్రేక్షకులు ఆకట్టుకోవడం జరిగింది. గతంలో దళపతి, రోజా, బొంబాయి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైనప్పటికీ.. ధృవ సినిమాలో విలన్ అంటే అరవింద స్వామిలా ఉండాలనే లా అదరకొట్టాడు.

Mahesh Babu Gave Shock To Aravind Swamy

దీంతో.. తెలుగు సినిమా నిర్మాతల నుంచి అరవింద్‌కు డిమాండ్ పెరిగింది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 15మంది నిర్మాతలు తమ సినిమాల్లో నటించాలని అడిగారట అరవింద్ స్వామిని.


ఇలా విలన్ గా అడిగిన ఆ లిస్ట్‌లో మహేశ్ బాబు, కొరటాల సినిమా కూడా ఉందట. అయితే, ధృవ సినిమాకే అరవింద స్వామి దాదాపు రూ. 3కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నాడనే వార్తలు వెలువడిన నేపథ్యంలో.. ఆ సినిమాతో తనకు మరింత క్రేజ్ రావడంతో తరువాతి సినిమాలకు ఆ స్థాయిలోనే పారితోషికం తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట అరవింద స్వామి.

ఈ నేపథ్యంలో.. మహేశ్ సినిమాకు కూడా అదే స్థాయిలో డిమాండ్ చేశాడట అరవింద స్వామి అని చెప్పుకుంటున్నారు. ఈ రెమ్యునేషన్ మ్యాటర్ మహేష్ బాబు చెవిన పడడంతో అంత రేటయితే అవసరం లేదని చెప్పేశాడట. ఈ విషయం కాస్త అరవింద్ చెవిన పడడంతో షాక్ అవడం అతని వంతయ్యిందట.

English summary
After Dhruva Movie Success Aravind Swamy Got Full Fame as Most Wanted Stylish Villan. He Got Full Demand in Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu