»   » 'వేదం' క్రిష్ నెక్స్ట్ చిత్రం రామ్ చరణ్ తో కాదట మరి..?

'వేదం' క్రిష్ నెక్స్ట్ చిత్రం రామ్ చరణ్ తో కాదట మరి..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గమ్యం, వేదం చిత్రాలతో తనకంటూ తెలుగు చిత్రపరిశ్రమలో ఓ ముద్రవేసుకున్న దర్శకుడు క్రిష్. ఆయన రీసెంట్ గా వేదంని తమిళంలో రూపొందించి హిట్ కొట్టారు. అయితే ఆ తర్వాత ఆయన రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారని వినిపించింది. అయితే ఇప్పుడు సీన్ మారింది.ఆరెంజ్ ఫెయిల్యూర్ తర్వాత తన కుమారుడు రామ్ చరణ్ కేవలం కమర్షియల్ సినిమాలే చేయాలని, ప్రయోగాల జోలికి అస్సలు పోకూడదని అతని తండ్రి మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించారని సమాచారం. ఆ మేరకు క్రిష్ చెప్పిన స్టోరీ లైన్ ని రిజెక్టు చేసారని తెలుస్తోంది. దాంతో క్రిష్ వెంటనే మహేష్ ని కలిసి ఓ కథ చెప్పి ఒప్పించాడని తాజా సమాచారం. దిల్ రాజు వెంటనే ఈ చిత్రం తను నిర్మిస్తానని ముందుకు వచ్చినట్లు చెప్తున్నారు. ఎప్పటినుంచో దిల్ రాజుతో సినిమా చేస్తానని మహేష్ మాట ఇచ్చి ఉన్నాడు. దాన్ని ఈ రకంగా తీరుస్తున్నారని చెప్తున్నారు. ఇక క్రిష్ కూడా సూపర్ స్టార్ తో సినిమా చేయటంతో ఉత్సాహంగా ఉన్నారు.

English summary
Krish met Mahesh Babu and narrated him an interesting storyline and the latter too impressed with it and gave his nod. Then Dil Raju came into the picture and got an agreement with him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu