»   » 'పందెం కోడి' దర్సకుడుకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్..

'పందెం కోడి' దర్సకుడుకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రన్, పందెం కోడి, ఆవారా చిత్రాల ద్వారా తెలుగు పరిచయమైన లింగు స్వామి...మహేష్ కాంబినేషన్ ఓకే అయినట్లు విశ్వసనీయ సమాచారం.ఆయన రీసెంట్ గా మహేష్ ని కలిసి ఓ కథని నేరేట్ చేసారు. కథ విన్న వెంటనే మహేష్..సినిమా చేయటానికి పచ్చ జెండా ఊపారు. ఈ విషయమై లింగు స్వామి మాట్లాడుతూ...దాదాపు ఏడు సంవత్సరాలనుంచి మహేష్‌తో చిత్రం చేయాలనుకుంటున్నానని అది ఇప్పటికి నెరవేరుతోందని తెలిపారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, పరాస్‌జైన్ నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ అన్నయ్యగా మాధవన్ ఓ కీలకమైన పాత్రను చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లింగుస్వామి తమిళంలో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే మహేష్ నటించిన 'ఖలేజా" చిత్రం అక్టోబర్ 7న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం అనంతరం మహేష్ తన తదుపరి చిత్రం దూకుడులో బిజీ అవుతారు. శ్రీనువైట్ల దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా చేస్తున్నారు. ఇదేకాక మెహర్ రమేష్ దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu