»   » ప్రిన్స్ మహేష్ బాబు ఇక్కడా హీరోయే! అక్కడా హీరోయే!

ప్రిన్స్ మహేష్ బాబు ఇక్కడా హీరోయే! అక్కడా హీరోయే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని విషయాలు వినడానికి విచిత్రంగా అనిపిస్తాయి..ఆ తర్వాత ఆ విషయాలే సినిమాలుగా వస్తే ఎలా ఉంటుందో రీసెంట్ గా విడుదల అయినటువంటి 'ఏ మాయ చేసావె" చిత్రం చెబుతుంది. ఆ చిత్ర స్టోరీ ఎవరిదో తెలుసా? స్వయానా చిత్ర నిర్మాత మంజులది..తన భర్తను సొంతం చేసుకోవడానికి అంత కష్టపడాల్సి వచ్చిందట..మంజుల. ఆ విషయం ప్రక్కన పెడితే మహేష్ బాబు సినిమాలు ఆలస్యం అవడానికి కారణం ఈ మధ్య అతని భార్యే అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వర్తల్లో ఎంత వరకు నిజం ఉంది అని అనుకున్న వారికి స్వయంగా నమ్రతా నిజమే అని చెబుతుంది. ఏమిటాకారణం అనుకుంటున్నారా?

ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో నమ్రత తల్లిడండ్రు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోవడంతో మానసింకగా కుంగిపోయిన నమ్రతకు, మహేష్ సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చి దగ్గరుండి ధైర్యం చెబుతూ, తోడుగా నిలిచాడని చెబుతుంది. ఈ కొద్దికాలంలోనే ఇంటిపట్టున ఉన్న రాజకుమారుడు తన కొడుకు ప్రేమలో పడిపోయాడు..అందుకే సినిమాలలో నటించడం ప్రక్కన పెట్టేశాడట..అది అసలు విషయం.

అన్నట్టు నమ్రత, మహేష్ ల పెళ్లి జరగడానికి కారణం ఎవరో తెలుసా?మంజుల..అలాగే తన అక్కకి పెళ్లి జరగడానికి కారణం మహేష్ అట..తమ్ముడి ప్రేమను..ఇంట్లో ఒప్పించి పెళ్లి వరకు మంజుల తీసుకువస్తే..అక్క ప్రేమకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకువచ్చే పనిని భుజాలపై వేసుకున్నాడు..మహేష్...చూశారా ఎంత విచిత్రంగా ఉన్నాయో బంధాలు అమాయకుడిగా కనిపించే మహేస్ తెరవెనుక చాలా చేస్తున్నాడని తెలుస్తుంది..కదా! ఎక్కడైనా హీరో గానే ఉండాలి..కదా! అదే అతని నైజం మరి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu