Just In
- 21 min ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 9 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- 10 hrs ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
- 11 hrs ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
Don't Miss!
- News
పోటెత్తుతోన్న ట్రాక్టర్లు: ఢిల్లీ చుట్టూ.. మూడు మార్గల్లోనే: కనివినీ ఎరుగని భద్రత
- Automobiles
ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బావ కోసం మహేష్...వస్తున్నాడు
హైదరాబాద్ : మహేష్ బాబు విజయవాడ రాబోతున్నారా...అవుననే అంటున్నారు ఆయన అభిమానులు. ఈ నెల 25న మహేష్ బాబు విజయవాడ వస్తారని, బ్యానర్స్, హోర్డింగ్స్ పురమాయించుకుంటున్నారు అక్కడ ఫ్యాన్స్. ఇంతకీ హఠాత్తుగా అక్కడ మహేష్ కు ఏం పని అంటారా. ఆయన తన బావ సుధీర్ బాబు నటించిన కొత్త చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' ఆడియో పంక్షన్ లో పాల్గొననున్నారని చెప్తున్నారు. మహేష్ ఈ పంక్షన్ కు ముఖ్య అతిథి అంటున్నారు. అయితే ఈ విషయమై నిర్మాత, హీరో సైడ్ నుంచి ఏ విధమైన అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ లేదు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' విశేషాలకు వస్తే...
మహష్‌బాబు ఇప్పటి వరకు 'జల్సా', 'బాద్‌షా' చిత్రాల్లో తన గొంతునే వినిపించారు. తొలిసారి ఓ చిత్రంలో అతిధిగా అలరించనున్నారు. సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రంలో మహేష్ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ''ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్ర ప్రత్యేకంగా, ఆసక్తిగా ఉంటుంది. ఆయన కథ చెప్పగానే నటించడానికి అంగీకరించారు. ఆయన ఈ చిత్రాన్ని అంగీకరించడంలో సుధీర్‌బాబుది కీలక పాత్ర. మహేష్ అభిమానులకు నచ్చేలా ఆయన పాత్ర ఉంటుంది'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహేష్ ...కొరటాల శివ చిత్రంతో బిజీగా ఉన్నారు.
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ మాట్లాడుతూ.... ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి అయితే వాటి అన్నింటికి భిన్నంగా మేము ఓ సినిమాను రూపొందించాలని తలపెట్టాము.. దాని ఫలితమే ఈ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా .. ఈ సినిమాను పోల్చ వలసి వస్తే గతంలో తెలుగు లో వచ్చిన మరో చరిత్ర హిందీలో వచ్చిన ప్రేమ పావురాలు సినిమా స్థాయిలో ఉంటుంది. ఈ చిత్ర దర్శకుడు చంద్రు కన్నడంలో ఎంతో పేరు ఉన్న దర్శకుడు.. అతడు అక్కడ వరస విజయాలను అందించాడు.
ఈ చిత్రం సంగీతం గురించి చెప్ప వలసి వస్తే ఆదిత్యా మ్యూజిక్ వారు మామూలు రేటు కంటే పదంతలు ఎక్కువ పెట్టి కొన్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన సంగీతాన్ని వారు చేస్తేనే బాగుంటుంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు హరి ఎ.ఆర్. రెహమాన్ అంతటి స్థాయిలో సంగీతాన్ని అందించాడు అని వారు కొనియాడారు. ఈ సినిమా సంగీతం పరంగా సినిమా పరంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం మాకు ఉంది. మా బేనర్ స్థాపించి పదేండ్లు కావస్తున్న సందర్భంగా ఈ సినిమా మంచి విజయాన్ని సంపాదించి పెడుతుందని ఆశిస్తున్నాము అన్నారు.
సమర్పకుడు లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ- కన్నడంలో విజయవంతమైన ‘చార్మినార్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నామని, ఈ చిత్రాన్ని చూసిన తొలిచూపులోనే ఇష్టపడి చిత్రాన్ని నిర్మించాలనుకున్నానని, ప్రేమకథాచిత్రమ్‌తో హిట్ పెయిర్‌గా నిలిచిన వీరిద్దరితో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో చక్కని ప్రేమకథ ఉందని, తెలుగు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని ఆయన అన్నారు.
దర్శకుడు కథ చెప్పిన తీరు నచ్చడంతో తానీ చిత్రాన్ని ఒప్పుకున్నానని, సినిమా ప్రతీ ప్రేక్షకుడికి నచ్చుతుందని, ప్రతిఒక్కరూ ఈ సినిమా చూసి తమ పాత రోజులు గుర్తుచేసుకుంటారని హీరో సుధీర్‌బాబు తెలిపారు.
కన్నడంలో పెద్ద చిత్రాలమధ్య విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిందని, కథకు తగిన విధంగా పేరును కూడా నిర్ణయించామని దర్శకుడు చంద్రు అన్నారు.
గిరిబాబు, ఎం.ఎస్.నారాయణ, సారికా రామచంద్రరావు, చిట్టిబాబు, అభిజిత్, కిషోర్‌దాస్, ఆశాలత, ప్రగతి, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్న చిత్రానికి మాటలు: ఖధీర్‌బాబు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా:కె.ఎస్.చంద్రశేఖర్, సంగీతం: హరి, నిర్మాత: శిరీషా శ్రీధర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్.చంద్రు.