»   » ‘ఆగడు’లో మహేష్ పాత్ర పేరు..స్పూర్తి

‘ఆగడు’లో మహేష్ పాత్ర పేరు..స్పూర్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : మహేష్ బాబు తాజాగా 'ఆగడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ పాత్ర నానా పటేకర్...అబ్ తక్ చప్పన్ చిత్రంలో చేసిన ఎనకౌంటర్ స్పెషలిస్ట్ ప్రేరణతో ఉంటుందని సమాచారం. అలాగే ఈ పాత్ర పేరు...ఎనకౌంటర్ శంకర్ అని, అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, చాలా పరవ్ ఫుల్ గా ఈ పాత్రను డిజైన్ చేసారని, అయితే ఆ కథ సీరియస్ గా జరిగితే ఈ సారి..ఫన్ తో నడుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లోచెప్పుకుంటున్నారు

ఇక మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్‌కి ఎక్కడలేని క్రేజ్‌ని తీసుకొచ్చిన చిత్రం దూకుడు. ఇప్పుడు మళ్లీ వారిద్దరి కలయికలో సినిమా అనగానే... 'ఆగడు'పై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. తమన్నా తొలిసారి మహేష్‌తో జతకడుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని ఇటీవల లాంచనంగా జరిపారు. అయితే... ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు.

దానికి కారణం మహేష్ '1' సినిమా. ఆ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండటంతో 'ఆగడు' షూటింగ్ కాస్త ఆగాల్సి వచ్చింది. '1' షూటింగ్ త్వరలో పూర్తి కానుండటంతో ఈ నెల 28న 'ఆగడు' పట్టాలెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ముందు శ్రీహరిని అనుకున్నారు. ఆయన హఠాన్మరణం కారణంగా ఇప్పుడు ఆ పాత్రకు సాయికుమార్‌ని తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో మహేష్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్‌గా కనిపిస్తారని ఫిలిమ్‌నగర్ సమాచారం.

'దూకుడు'లో తెలంగాణ శ్లాంగ్‌తో అలరించిన ప్రిన్స్.. 'ఆగడు'లో రాయలసీమ యాసలో మెప్పిస్తారని వినికిడి. సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర భావిస్తున్నారు. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయా గ్రహణం: కె.వి.గుహన్.

English summary

 Mahesh Babu is playing an encounter specialist in "Aagadu"and sources said that his character name in the flick is Encounter Shankar. The film is to be made on Anantapur backdrop and Mahesh used to speak raayalaseema slang for the first time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu