»   » ఐపీఎల్ టీం కొనుగోలు చేయబోతున్న మహేష్ బాబు?

ఐపీఎల్ టీం కొనుగోలు చేయబోతున్న మహేష్ బాబు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు సినిమాలు, వాణిజ్య ప్రకటనలకే పరిమితం అయ్యారు. తాజాగా ఆయన మరో కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన క్రీడా రంగానికి సంబంధించిన వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా భారత్ లో అత్యంత ఆదరణ పొందించిన క్రీకెట్‌కు సంబంధించిన వ్యాపారంలోకి.

ఆయన ఐపీఎల్ టీం కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ ఇపుడు సపరేట్ రాష్ట్రం అయిన నేపథ్యంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ తెలంగాణ టీం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రలో కూడా ఓ ఫ్రాంచైజీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.

Mahesh Babu is entering into IPL

దీనికి ‘వైజాగ్ సిక్సర్స్' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 2017లో ఈ టీం ఐపీఎల్‌లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది. త్వరలో మహేష్ బాబు నుండి ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అకాశం ఉందని టాక్. మహేష్ బాబుకు స్టార్ ఇమేజ్ ఉండటంతో ఐపీఎల్ టీం కొనుగోలు బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు.

English summary
Sources revealed that Mahesh is in discussions with his brother-in-law, Guntur TDP MP Galla Jayadev to buy a new franchise of IPL team for Vizag.
Please Wait while comments are loading...