»   »  మహేష్ బాబు ‘మగాడు’ అంటున్నారు, నిజమా?

మహేష్ బాబు ‘మగాడు’ అంటున్నారు, నిజమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'శ్రీమంతుడు' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అదే టైటిల్ ని ఖరారు చేయనున్నారా లేక వేరే టైటిల్ తో ముందుకు వెళ్తారా అనేది ఇప్పుడు వరకూ తేలలేదు..దర్సక,నిర్మాతలు తేల్చలేదు. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘మగాడు' అనే టైటిల్ పెట్టాలని డిసైడ్ అయినట్లు టాక్. మే 31 న ఏదో ఒక టైటిల్ అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

వివరాల్లోకి వెళితే...మే 31 ...మహేష్ తండ్రి కృష్ణ జన్మదినం. ఈ సందర్భంగా మహేష్‌బాబు కొత్త సినిమాకి సంబంధించిన తొలి ప్రచార చిత్రం విడుదల కాబోతోంది. మహేష్‌ - కొరటాల శివ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రుతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కిస్తోంది.

అలాగే....ఈ సినిమాని జూలైలో రిలీజ్ చెయ్యాలని ముందుగా ప్లాన్ చేసుకొని జూలై 17వ తేదీని ఈ సినిమా రిలీజ్ కోసం లాక్ చేసారు. కానీ గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో పెండింగ్ వర్క్ ఇంకా చాలా ఉండండం వలన ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మహేష్ బాబు మాత్రం అనుకున్న తేదీకే రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu - Koratala Shiva Movie Title Magadu?

ఈ విషయంపై మహేష్ బాబు ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీస్ వారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 17న సినిమా రిలీజ్ చేయాల్సిందే అని కూడా చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ‘బ్రహ్మోత్సవం' స్టార్ట్ చేశారు. మే నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలయికలో తెరకెక్కుతున్న రెండవ సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మిక్కి జె మేయర్ స్వరాలు సమకూరుస్తారు. మే 31 లాంచనంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభిస్తారని సమాచారం.

ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని సమాచారం. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటీనటుల కోసం కాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మహేష్, శ్రీకాంత్ అడ్డాల కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

English summary
Prince Mahesh Babu is currently busy in filming for his upcoming project under the direction of Mirchi fame Koratala Shiva. As per the latest buzz, the makers are mulling to name this flick as ‘Magadu’. Till now, Srimanthudu is the tentative title that has been doing rounds in the film and media circles.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu