»   » మహేష్ కు ఈ టైటిల్ నప్పదేమో

మహేష్ కు ఈ టైటిల్ నప్పదేమో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోల ఇమేజ్ లను పరిగణలోకి తీసుకునే...కథలు,టైటిల్స్ పెడుతూంటారు. అయితే ఈ మధ్య కాలంలో ముందుగా సినిమా ప్రారంభానికి ముందే కొన్ని టైటిల్స్ మీడియాలో ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. వాటిని కావాలని కొందరు దర్శక,నిర్మాతలు స్పందన తెలుసుకోవటం కోసం తమకు పరిచయమున్న మీడియా వ్యక్తులు ద్వారా జనం లోకి వదులుతున్నారని కూడా అంటున్నారు. తాజాగా మహేష్, కొరటాల శివ టైటిల్ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఆ టైటిల్ 'పరాక్రమ'. ఏ రాజులు కథకో పెట్టాల్సిన టైటిల్ ఇది అని మహేష్ కు నప్పదేమో అంటున్నారు.

ప్రస్తుతం మహేష్ 'ఆగడు' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈలోగా మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. మహేష్‌బాబు - కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటుందని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా బండి ముందుకు కదిలింది. కథ సిద్ధమైందని.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తామని చిత్రబృందం ప్రకటించింది.

మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్‌, మాస్‌ కలిపిన కథలో మహేష్‌ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.

 Mahesh Babu,Koratala Shiva tilte Parakrama

నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము. రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి ఉంటుంది అన్నారు.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శ్త్తకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా జూలై నెలలో ప్రారంభం కానుంది. ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్.

English summary
Koratala Shiva is going to direct a new movie with Mahesh Babu and Mythri Movies is going to produce the film. This movie title might be ‘Parakrama’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu