»   » సూపర్ డెసిషన్ : సీటు రిజర్వ్ చేసుకునే మహేష్ సీన్ లోకి...

సూపర్ డెసిషన్ : సీటు రిజర్వ్ చేసుకునే మహేష్ సీన్ లోకి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా ప్రారంభానికి ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటం ఈ మధ్యకాలంలో కామన్ గా మారింది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లలకు,ట్రేడ్ వర్గాలకు ఓ క్లారిటీ ఏర్పడుతుంది. అంతేకాకుండా మిగతా సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేసుకోవటానికి ఓ దారి దొరుకుతుంది. ఓ రకంగా ఇధి సీట్ రిజర్వ్ చేసుకోవటం లాంటింది. మేం ఫలానా పండుగ రోజు వస్తున్నాం...ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మహేష్ తదుపరి చిత్రానికి అదే జరుగుతోంది.

'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రిస్టీజియస్‌ మూవీ మొదలైన సంగతి తెలిసిందే. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి వచ్చే సంవత్సరం 2017...దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించుకన్నట్లు సమాచారం.

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ... ''శ్రీమంతుడు లాంటి సూపర్‌ మూవీ తర్వాత మహేష్‌బాబు లాంటి సూపర్‌స్టార్‌తో శ్రీమంతుడు కంటే పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో తీస్తున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా వుంటుంది. ఇందులో మహేష్‌బాబు ఇంతకుముందు పోషించని ఒక వైవిధ్యమైన పాత్రను చేస్తున్నారు. హీరోయిన్‌ ఎంపిక జరుగుతోంది. ముఖ్యపాత్రల్లో భారీ తారాగణం నటిస్తారు. రవి కె.చంద్రన్‌, దేవిశ్రీప్రసాద్‌ వంటి టాప్‌ టెక్నీషియన్స్‌తో చాలా పెద్ద రేంజ్‌లో దానయ్యగారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు'' అన్నారు.

Mahesh Babu and Koratala Siva movie release date confirmed

నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ... ''మహేష్‌బాబుతో ఓ సెన్సేషనల్‌ మూవీ చెయ్యాలన్న నా చిరకాల కోరిక ఈ ప్రాజెక్ట్‌తో నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. వరసగా ఘనవిజయాల్ని అందిస్తున్న కొరటాల శివగారి దర్శకత్వంలో ఇంత మంచి సినిమా చేస్తున్నందుకు గర్వంగా వుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా ఈ చిత్రం నిర్మాణం అవుతుంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ.. ''వరుసగా కొరటాల శివ సినిమాలన్నీ చేయడం చాలా ఆనందంగా వుంది. మహేష్‌బాబుగారితో చేసిన శ్రీమంతుడు ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. ఇది శ్రీమంతుడు కంటే పెద్ద కథ. అలాగే శ్రీమంతుడు కంటే ఆడియో పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

English summary
Mahesh and Koratala Siva, combo created waves and new box office records with their movie Srimanthudu and once again coming back with another prestigious movie to entertain us. Regular movie shooting will be starting from end of January 2017 and producers planning to release this flick on Dussehra 2017.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu