»   » పరువు పోయింది: ‘తానా’కు ఝలక్ ఇచ్చిన మహేష్ బాబు

పరువు పోయింది: ‘తానా’కు ఝలక్ ఇచ్చిన మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హైదరాబాద్: మహేష్ బాబు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు ఆయన సినిమాల్లో తప్ప బయట కనబపడటమే అరుదు. ఆయన ఏదైనా సినిమా ఫంక్షన్ కు హాజరైనా...ఏదైనా షోరూం ప్రారంభోత్సవానికి వచ్చినా అభిమానుల తాకిడి ఎలా ఉంటుందో కొత్తగాచెప్పక్కర్లేదు. అందుకే పలు కార్పొరేట్ సంస్థలు మహేష్ బాబుతో పోటీ పడటానికి పోటీ పడుతున్నాయి.

ఇక విదేశాల్లో ఉండే తెలుగు వారు సైతం మహేష్ బాబు అంటే పడి చస్తారు. అందుకే ఆయన సినిమాలకు అక్కడ భారీ కలెక్షన్లు వస్తుంటాయి. అమెరికాలో తెలుగువాళ్లు చేసే ఉత్సవాల్లో 'తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) వేడుకలు' చాలా ఫేమస్. ఇక్కణ్ణుంచి ప్రముఖ తారలను అతిథులుగా పిలిచి, అక్కడి తెలుగువారిని ఆనందపరుస్తుంటారు తానా వేడుకల నిర్వాహకులు.

Mahesh Babu not attending TANA

ఈ ఏడాది జూలైలో అమెరికాలోని డెట్రాయిట్ లో ఓ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా మహేష్ బాబుని కోరారట. మహేష్ బాబు ఓకే చెప్పినట్లు, గౌరవ వేతనం కింద మహేష్ బాబుకి గంటలకు రూ. 50 లక్షల చొప్పున 3 గంటలకు రూ. 1.5కోట్లు తానా అసోసియేషన్ వారు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది.

మహేష్ బాబు తన ఇమేజ్ ను క్యాష్ చేసుకుంటున్నాడని, అందుకోసమే ఇంత భారీ మొత్తం తీసుకుంటున్నాడనే ప్రచారం కూడా జరిగింది. మహేష్ బాబు అలా చేయడం లేదు, ఈ మొత్తాన్ని "Heal A Child Organization" కోసం డొనేట్ చేయనున్నట్లు మరో వాద.

‘తానా' ప్రతినిధులు చెప్పడం వల్లనే ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని, తన పేరు ఇలా బదనాం కావడం వెనక తానా కు చెందిన వారే ఉన్నారని భావిస్తున్న మహేష్ బాబు ఆగ్రహంగా ఉన్నారని, అందుకే తాను తానా సభలకు రావడం లేదని నిర్వాహకులకు చెప్పినట్లు టాక్.

English summary
Film Nagar source said that, Mahesh Babu not attending TANA.
Please Wait while comments are loading...