For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కనీవినీ ఎరుగని విధంగా మహేష్ బాబు స్ట్రాంగ్ డిసీజన్.. ఆదేశాలు జారీ..!

  |

  వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఏ హీరో చేయని విధంగా ఆయన ప్లాన్ చేశారని, ఈ మేరకు ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని టాక్ నడుస్తోంది. ఇంతకీ మహేష్ ప్లాన్ ఏంటి? సినిమాల పరంగానేనా? లేక మరేదైనా ఉందా? ఆ వివరాలేంటో చూద్దామా..

  వరుస హిట్స్.. సరిలేరు నీకెవ్వరు

  వరుస హిట్స్.. సరిలేరు నీకెవ్వరు

  భరత్ అనే నేను, మహర్షి లాంటి భారీ సక్సెస్‌ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేసి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు మహేష్. వరుస విజయాలతో ఆయనలో, ఆయన అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఈ మేరకు ఆ ఉత్సాహానికి రెక్కలు కట్టేలా మహేష్ అడుగులేస్తున్నారు.

  బిజినెస్‌మేన్‌ మహేష్ బాబు

  బిజినెస్‌మేన్‌ మహేష్ బాబు

  నటుడిగానే కాకుండా బిజినెస్‌మేన్‌ గానూ మహేష్ వేస్తున్న అడుగులు నేటితరం హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఓ వైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, నిర్మాతగానూ తన మార్క్‌ చూపిస్తూ వస్తున్నారు మహేష్. తన సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమాలు నిర్మించడంలోనూ ముందుంటున్నారు. ఈ బాటలోనే ఇటీవలే విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నిర్మాణంలో భాగమయ్యారు మహేష్.

  వస్త్ర ప్రపంచం.. ది హంబుల్ కో

  వస్త్ర ప్రపంచం.. ది హంబుల్ కో

  'హంబుల్' పేరుతో కొత్త వస్త్ర వాయపరంలోనూ అడుగుపెట్టేశారు మహేష్ బాబు. ఈ బ్రాండ్‌ని గతేడాది ఆగస్టు 7వ తేదీన గ్రాండ్‌గా లాంచ్ చేసి సక్సెస్ అయ్యారు. ది హంబుల్ కో పేరుతో కొత్త వ్యాపారం మొదలుపెట్టానని, మీ అందరికీ వెల్‌కమ్ చెబుతున్నానని మహేష్ బాబు అప్పట్లో ప్రకటించాడు.

  హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్

  హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్

  ఇక సినీ ఇండస్ట్రీకి అనుబంధం రంగమైన థియేటర్‌ బిజనెస్‌లోకి కూడా మహేష్ ఇటీవలే అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్ నిర్మించి ఓపెన్ చేశారు. ఏఎంబీ సినిమాస్‌ పేరుతో రూపొందిన ఈ మల్టీప్లెక్స్‌‌లో

  7 స్క్రీన్స్‌తో దాదాపు 1600 సీటింగ్‌ కెపాసిటీ, అధునాతన సౌకర్యాలు ఉండటం విశేషం.

  మహేష్ స్ట్రాంగ్ డిసీజన్.. ఆ సారి ఏకంగా!

  మహేష్ స్ట్రాంగ్ డిసీజన్.. ఆ సారి ఏకంగా!

  అయితే ఈ ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్ సూపర్‌ సక్సెస్‌ కావటంతో త్వరలో మరో భారీ మల్టీప్లెక్స్‌ నిర్మించాలని డిసైడ్ అయ్యారట సూపర్ స్టార్ మహేష్. ఎలాంటి భాగస్వామ్యాలు లేకుండా సొంతంగా భారీ మల్టీప్లెక్స్‌ రూపొందించేలా స్కెచ్ వేసేశారట. ఏఎంబీని మించేలా ఈ నిర్మాణం ఉండాలని ఇప్పటికే రూపకర్తలకు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈ భారీ థియేటర్ బెంగళూరులో నిర్మించేందుకు మహేష్ ప్రయత్నాలు మొదలు పెట్టారట.

  Anil Ravipudi Says Sarileru Neekevvaru Dialogue In Disco Raja Event
  మహేష్ 27.. హీరోయిన్ ఎవరంటే

  మహేష్ 27.. హీరోయిన్ ఎవరంటే

  ఇలా వ్యాపారాలు విస్తరించడంతో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ రెండు రంగాల్లో ప్యారలల్‌గా సత్తా చాటేలా మహేష్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన మహేష్ బాబు.. తిరిగి వచ్చిన వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రానున్న ఈ మూవీలో కియారాను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు టాక్.

  English summary
  Mahesh Babu planning to starts a new business which is huze multiplex. Now he is enjoying forein tour, then after he come on to the Vamshi Paidipally sets.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X